Rajarajeshwari Sahasranama Stotram is the 1000 names of Rajarajeshwari Devi composed in the form of a stotram. Get Sri Rajarajeshwari Sahasranama Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Goddess Rajarajeshwari Devi.
Rajarajeshwari Sahasranama Stotram in Telugu – శ్రీ రాజరాజేశ్వరీ సహస్రనామ స్తోత్రం
రాజరాజేశ్వరీ రాజరక్షకీ రాజనర్తకీ |
రాజవిద్యా రాజపూజ్యా రాజకోశసమృద్ధిదా || 1 ||
రాజహంసతిరస్కారిగమనా రాజలోచనా |
రాజ్ఞాం గురువరారాధ్యా రాజయుక్తనటాంగనా || 2 ||
రాజగర్భా రాజకందకదలీసక్తమానసా |
రాజ్ఞాం కవికులాఖ్యాతా రాజరోగనివారిణీ || 3 ||
రాజౌషధిసుసంపన్నా రాజనీతివిశారదా |
రాజ్ఞాం సభాలంకృతాంగీ రాజలక్షణసంయుతా || 4 ||
రాజద్బలా రాజవల్లీ రాజత్తిల్వవనాధిపా |
రాజసద్గుణనిర్దిష్టా రాజమార్గరథోత్సవా || 5 ||
రాజచక్రాంకితకరా రాజాంశా రాజశాసనా |
రాజత్కృపా రాజలక్ష్మీః రాజత్కంచుకధారిణీ || 6 ||
రాజాహంకారశమనా రాజకార్యధురంధరా |
రాజాజ్ఞా రాజమాతంగీ రాజయంత్రకృతార్చనా || 7 ||
రాజక్రీడా రాజవేశ్మప్రవేశితనిజాశ్రితా |
రాజమందిరవాస్తవ్యా రాజస్త్రీ రాజజాగరా || 8 ||
రాజశాపవినిర్ముక్తా రాజశ్రీ రాజమంత్రిణీ |
రాజపుత్రీ రాజమైత్రీ రాజాంతఃపురవాసినీ || 9 ||
రాజపాపవినిర్ముక్తా రాజర్షిపరిసేవితా |
రాజోత్తమమృగారూఢా రాజ్ఞస్తేజఃప్రదాయినీ || 10 ||
రాజార్చితపదాంభోజా రాజాలంకారవేష్టితా |
రాజసూయసమారాధ్యా రాజసాహస్రసేవితా || 11 ||
రాజసంతాపశమనీ రాజశబ్దపరాయణా |
రాజార్హమణిభూషాఢ్యా రాజచ్ఛృంగారనాయికా || 12 ||
రాజద్రుమూలసంరాజద్విఘ్నేశవరదాయినీ |
రాజపర్వతకౌమారీ రాజశౌర్యప్రదాయినీ || 13 ||
రాజాభ్యంతఃసమారాధ్యా రాజమౌలిమనస్వినీ |
రాజమాతా రాజమాషప్రియార్చితపదాంబుజా || 14 ||
రాజారిమర్దినీ రాజ్ఞీ రాజత్కల్హారహస్తకా |
రామచంద్రసమారాధ్యా రామా రాజీవలోచనా || 15 ||
రావణేశసమారాధ్యా రాకాచంద్రసమాననా |
రాత్రిసూక్తజపప్రీతా రాగద్వేషవివర్జితా || 16 ||
రింఖన్నూపురపాదాబ్జా రిట్యాదిపరిసేవితా |
రిపుసంఘకులధ్వాంతా రిగమస్వరభూషితా || 17 ||
రుక్మిణీశసహోద్భూతా రుద్రాణీ రురుభైరవీ |
రుగ్ఘంత్రీ రుద్రకోపాగ్నిశమనీ రుద్రసంస్తుతా || 18 ||
రుషానివారిణీ రూపలావణ్యాంబుధిచంద్రికా |
రూప్యాసనప్రియా రూఢా రూప్యచంద్రశిఖామణిః || 19 ||
రేఫవర్ణగలా రేవానదీతీరవిహారిణీ |
రేణుకా రేణుకారాధ్యా రేవోర్ధ్వకృతచక్రిణీ || 20 ||
రేణుకేయాఖ్యకల్పోక్తయజనప్రీతమానసా |
రోమలంబితవిధ్యండా రోమంథమునిసేవితా || 21 ||
రోమావలిసులావణ్యమధ్యభాగసుశోభితా |
రోచనాగరుకస్తూరీచందనశ్రీవిలేపితా || 22 ||
రోహిణీశకృతోత్తంసా రోహిణీపితృవందితా |
రోహితాశ్వసుసంభూతా రౌహిణేయానుజార్చితా || 23 ||
రౌప్యసింహాసనారూఢచాక్షుష్మన్మంత్రవిగ్రహా |
రౌద్రమంత్రాభిషిక్తాంగీ రౌద్రమధ్యసమీడితా || 24 ||
రౌరవాంతకరీ రౌచ్యపత్రపుష్పకృతార్చనా |
రంగలాస్యకృతాలోలా రంగవల్ల్యాద్యలంకృతా || 25 ||
రంజకశ్రీసభామధ్యగాయకాంతరవాసినీ |
లలితా లడ్డుకప్రీతమానసస్కందజన్మభూః || 26 ||
లకారత్రయయుక్తశ్రీవిద్యామంత్రకదంబకా |
లక్షణా లక్షణారాధ్యా లక్షబిల్వార్చనప్రియా || 27 ||
లజ్జాశీలా లక్షణజ్ఞా లకుచాన్నకృతాదరా |
లలాటనయనార్ధాంగీ లవంగత్వక్సుగంధవాక్ || 28 ||
లాజహోమప్రియా లాక్షాగృహే కౌంతేయసేవితా |
లాంగలీ లాలనా లాలా లాలికా లింగపీఠగా || 29 ||
లిపివ్యష్టిసమష్టిజ్ఞా లిపిన్యస్త త్రిణేత్రభృత్ |
లుంగాఫలసమాసక్తా లులాయాసురఘాతుకీ || 30 ||
లూతికాపతిసంపూజ్యా లూతావిస్ఫోటనాశినీ |
లృలౄవర్ణస్వరూపాఢ్యా లేఖినీ లేఖకప్రియా || 31 ||
లేహ్యచోష్యపేయఖాద్యభక్ష్యభోజ్యాదిమప్రియా |
లేపితశ్రీచందనాంగీ లైంగమార్గప్రపూజిజతా || 32 ||
లోలంబిరత్నహారాంగీ లోలాక్షీ లోకవందితా |
లోపాముద్రార్చితపదా లోపాముద్రాపతీడితా || 33 ||
లోభకామక్రోధమోహమదమాత్సర్యవారితా |
లోహజప్రతిమాయంత్రవాసినీ లోకరంజినీ || 34 ||
లోకవేద్యా లోలడోలాస్థితశంభువిహారిణీ |
లోలజిహ్వాపరీతాంగీ లోకసంహారకారిణీ || 35 ||
లౌకికీజ్యావిదూరస్థా లంకేశానసుపూజితా |
లంపటా లంబిమాలాభినందితా లవలీధరా || 36 ||
వక్రతుండప్రియా వజ్రా వధూటీ వనవాసినీ |
వధూర్వచనసంతుష్టా వత్సలా వటుభైరవీ || 37 ||
వటమూలనివాసార్ధా వరవీరాంగనావృతా |
వనితా వర్ధనీ వర్ష్యా వరాలీరాగలోలుపా || 38 ||
వలయీకృతమాహేశకరసౌవర్ణకంధరా |
వరాంగీ వసుధా వప్రకేలినీ వణిజా(జాం)వరా || 39 ||
వపురాయితశ్రీచక్రా వరదా వరవర్ణినీ |
వరాహవదనారాధ్యా వర్ణపంచదశాత్మికా || 40 ||
వసిష్ఠార్చ్యా వల్కలాంతర్హితరమ్యస్తనద్వయీ |
వశినీ వల్లకీ వర్ణా వర్షాకాలప్రపూజితా || 41 ||
వల్లీ వసుదలప్రాంతవృత్తకట్యాశ్రితాదరా |
వర్గా వరవృషారూఢా వషణ్మంత్రసుసంజ్ఞకా || 42 ||
వలయాకారవైడూర్యవరకంకణభూషణా |
వజ్రాంచితశిరోభూషా వజ్రమాంగల్యభూషితా || 43 ||
వాగ్వాదినీ వామకేశీ వాచస్పతివరప్రదా |
వాదినీ వాగధిష్ఠాత్రీ వారుణీ వాయుసేవితా || 44 ||
వాత్స్యాయనసుతంత్రోక్తా వాణీ వాక్యపదార్థజా |
వాద్యఘోషప్రియా వాద్యవృందారంభనటోత్సుకా || 45 ||
వాపీకూపసమీపస్థా వార్తాలీ వామలోచనా |
వాస్తోష్పతీడ్యా వామాంఘ్రిధృతనూపురశోభితా || 46 ||
వామా వారాణసీక్షేత్రా వాడవేయవరప్రదా |
వామాంగా వాంఛితఫలదాత్రీ వాచాలఖండితా || 47 ||
వాచ్యవాచకవాక్యార్థా వామనా వాజివాహనా |
వాసుకీకంఠభూషాఢ్యవామదేవప్రియాంగనా || 48 ||
విజయా విమలా విశ్వా విగ్రహా విధృతాంకుశా |
వినోదవనవాస్తవ్యా విభక్తాండా విధీడితా || 49 ||
విక్రమా విషజంతుఘ్నీ విశ్వామిత్రవరప్రదా |
విశ్వంభరా విష్ణుశక్తిర్విజిజ్ఞాసావిచక్షణా || 50 ||
విటంకత్యాగరాజేంద్రపీఠసంస్థా విధీడితా |
విదితా విశ్వజననీ విస్తారితచమూబలా || 51 ||
విద్యావినయసంపన్నా విద్యాద్వాదశనాయికా |
విభాకరాత్యర్బుదాభా విధాత్రీ వింధ్యవాసినీ || 52 ||
విరూపాక్షసఖీ విశ్వనాథవామోరుసంస్థితా |
విశల్యా విశిఖా విఘ్నా విప్రరూపా విహారిణీ || 53 ||
వినాయకగుహక్రీడా విశాలాక్షీ విరాగిణీ |
విపులా విశ్వరూపాఖ్యా విషఘ్నీ విశ్వభామినీ || 54 ||
విశోకా విరజా విప్రా విద్యుల్లేఖేవ భాసురా |
విపరీతరతిప్రీతపతిర్విజయసంయుతా || 55 ||
విరించివిష్ణువనితాధృతచామరసేవితా |
వీరపానప్రియా వీరా వీణాపుస్తకధారిణీ || 56 ||
వీరమార్తండవరదా వీరబాహుప్రియంకరీ |
వీరాష్టాష్టకపరీతా వీరశూరజనప్రియా || 57 ||
వీజితశ్రీచామరధృల్లక్ష్మీవాణీనిషేవితా |
వీరలక్ష్మీర్వీతిహోత్రనిటిలా వీరభద్రకా || 58 ||
వృక్షరాజసుమూలస్థా వృషభధ్వజలాంఛనా |
వృషాకపాయీ వృత్తజ్ఞా వృద్ధా వృత్తాంతనాయికా || 59 ||
వృవౄవర్ణాంగవిన్యాసా వేణీకృతశిరోరుహా |
వేదికా వేదవినుతా వేతండకృతవాహనా || 60 ||
వేదమాతా వేగహంత్రీ వేతసీగృహమధ్యగా |
వేతాలనటనప్రీతా వేంకటాద్రినివాసినీ || 61 ||
వేణువీణామృదంగాది వాద్యఘోషవిశారదా |
వేషిణీ వైనతేయానుకంపినీ వైరినాశినీ || 62 ||
వైనాయకీ వైద్యమాతా వైష్ణవీ వైణికస్వనా |
వైజయంతీష్టవరదా వైకుంఠవరసోదరీ || 63 ||
వైశాఖపూజితా వైశ్యా వైదేహీ వైద్యశాసినీ |
వైకుంఠా వైజయంతీడ్యా వైయాఘ్రమునిసేవితా || 64 ||
వైహాయసీనటీరాసా వౌషట్శ్రౌషట్స్వరూపిణీ |
వందితా వంగదేశస్థా వంశగానవినోదినీ || 65 ||
వమ్ర్యాదిరక్షికా వంక్రిర్వందారుజనవత్సలా |
వందితాఖిలలోకశ్రీః వక్షఃస్థలమనోహరా || 66 ||
శర్వాణీ శరభాకారా శప్తజన్మానురాగిణీ |
శక్వరీ శమితాఘౌఘా శక్తా శతకరార్చితా || 67 ||
శచీ శరావతీ శక్రసేవ్యా శయితసుందరీ |
శరభృచ్ఛబరీ శక్తిమోహినీ శణపుష్పికా || 68 ||
శకుంతాక్షీ శకారాఖ్యా శతసాహస్రపుజితా |
శబ్దమాతా శతావృత్తిపూజితా శత్రునాశినీ || 69 ||
శతానందా శతముఖీ శమీబిల్వప్రియా శశీ |
శనకైః పదవిన్యస్తప్రదక్షిణనతిప్రియా || 70 ||
శాతకుంభాభిషిక్తాంగీ శాతకుంభస్తనద్వయీ |
శాతాతపమునీంద్రేడ్యా శాలవృక్షకృతాలయా || 71 ||
శాసకా శాక్వరప్రీతా శాలా శాకంభరీనుతా |
శార్ఙ్గపాణిబలా శాస్తృజననీ శారదాంబికా || 72 ||
శాపముక్తమనుప్రీతా శాబరీవేషధారిణీ |
శాంభవీ శాశ్వతైశ్వర్యా శాసనాధీనవల్లభా || 73 ||
శాస్త్రతత్త్వార్థనిలయా శాలివాహనవందితా |
శార్దూలచర్మవాస్తవ్యా శాంతిపౌష్టికనాయికా || 74 ||
శాంతిదా శాలిదా శాపమోచినీ శాడవప్రియా |
శారికా శుకహస్తోర్ధ్వా శాఖానేకాంతరశ్రుతా || 75 ||
శాకలాదిమఋక్శాఖామంత్రకీర్తితవైభవా |
శివకామేశ్వరాంకస్థా శిఖండిమహిషీ శివా || 76 ||
శివారంభా శివాద్వైతా శివసాయుజ్యదాయినీ |
శివసంకల్పమంత్రేడ్యా శివేన సహ మోదితా || 77 ||
శిరీషపుష్పసంకాశా శితికంఠకుటుంబినీ |
శివమార్గవిదాం శ్రేష్ఠా శివకామేశసుందరీ || 78 ||
శివనాట్యపరీతాంగీ శివజ్ఞానప్రదాయినీ |
శివనృత్తసదాలోకమానసా శివసాక్షిణీ || 79 ||
శివకామాఖ్యకోష్ఠస్థా శిశుదా శిశురక్షకీ |
శివాగమైకరసికా శిక్షితాసురకన్యకా || 80 ||
శిల్పిశాలాకృతావాసా శిఖివాహా శిలామయీ |
శింశపావృక్షఫలవద్భిన్నానేకారిమస్తకా || 81 ||
శిరఃస్థితేందుచక్రాంకా శితికుంభసుమప్రియా |
శింజన్నూపురభూషాత్తకృతమన్మథభేరికా || 82 ||
శివేష్టా శిబికారూఢా శివారావాభయంకరీ |
శిరోర్ధ్వనిలయాసీనా శివశక్త్యైక్యరూపిణీ || 83 ||
శివాసనసమావిష్టా శివార్చ్యా శివవల్లభా |
శివదర్శనసంతుష్టా శివమంత్రజపప్రియా || 84 ||
శివదూతీ శివానన్యా శివాసనసమన్వితా |
శిష్యాచరితశైలేశా శివగానవిగాయినీ || 85 ||
శివశైలకృతావాసా శివాంబా శివకోమలా |
శివగంగాసరస్తీరప్రత్యఙ్మందిరవాసినీ || 86 ||
శివాక్షరారంభపంచదశాక్షరమనుప్రియా |
శిఖాదేవీ శివాభిన్నా శివతత్త్వవిమర్శినీ || 87 ||
శివాలోకనసంతుష్టా శివార్ధాంగసుకోమలా |
శివరాత్రిదినారాధ్యా శివస్య హృదయంగమా || 88 ||
శివరూపా శివపరా శివవాక్యార్థబోధినీ |
శివార్చనరతా శిల్పలక్షణా శిల్పిసేవితా || 89 ||
శివాగమరహస్యోక్త్యా శివోహంభావితాంతరా |
శింబీజశ్రవణానందా శిమంతర్నామమంత్రరాట్ || 90 ||
శీకారా శీతలా శీలా శీతపంకజమధ్యగా |
శీతభీరుః శీఘ్రగంత్రీ శీర్షకా శీకరప్రభా || 91 ||
శీతచామీకరాభాసా శీర్షోద్ధూపితకుంతలా |
శీతగంగాజలస్నాతా శుకా(క్రా)రాధితచక్రగా || 92 ||
శుక్రపూజ్యా శుచిః శుభ్రా శుక్తిముక్తా శుభప్రదా |
శుచ్యంతరంగా శుద్ధాంగీ శుద్ధా శుకీ శుచివ్రతా || 93 ||
శుద్ధాంతా శూలినీ శూర్పకర్ణాంబా శూరవందితా |
శూన్యవాదిముఖస్తంభా శూరపద్మారిజన్మభూః || 94 ||
శృంగారరససంపూర్ణా శృంగిణీ శృంగఘోషిణీ |
భృంగాభిషిక్తసుశిరాః శృంగీ శృంఖలదోర్భటా || 95 ||
శౄశ్లృరూపా శేషతల్పభాగినీ శేఖరోడుపా |
శోణశైలకృతావాసా శోకమోహనివారిణీ || 96 ||
శోధనీ శోభనా శోచిష్కేశతేజఃప్రదాయినీ |
శౌరిపూజ్యా శౌర్యవీర్యా శౌక్తికేయసుమాలికా || 97 ||
శ్రీశ్చ శ్రీధనసంపన్నా శ్రీకంఠస్వకుటుంబినీ |
శ్రీమాతా శ్రీఫలీ శ్రీలా శ్రీవృక్షా శ్రీపతీడితా || 98 ||
శ్రీసంజ్ఞాయుతతాంబూలా శ్రీమతీ శ్రీధరాశ్రయా |
శ్రీబేరబద్ధమాలాఢ్యా శ్రీఫలా శ్రీశివాంగనా || 99 ||
శ్రుతిః శ్రుతిపదన్యస్తా శ్రుతిసంస్తుతవైభవా |
శ్రూయమాణచతుర్వేదా శ్రేణిహంసనటాంఘ్రికా || 100 ||
శ్రేయసీ శ్రేష్ఠిధనదా శ్రోణానక్షత్రదేవతా |
శ్రోణిపూజ్యా శ్రోత్రకాంతా శ్రోత్రే శ్రీచక్రభూషితా || 101 ||
శ్రౌషడ్రూపా శ్రౌతస్మార్తవిహితా శ్రౌతకామినీ |
శంబరారాతిసంపూజ్యా శంకరీ శంభుమోహినీ || 102 ||
షష్ఠీ షడాననప్రీతా షట్కర్మనిరతస్తుతా |
షట్శాస్త్రపారసందర్శా షష్ఠస్వరవిభూషితా || 103 ||
షట్కాలపూజానిరతా షంఢత్వపరిహారిణీ |
షడ్రసప్రీతరసనా షడ్గ్రంథివినిభేదినీ || 104 ||
షడభిజ్ఞమతధ్వంసీ షడ్జసంవాదివాహితా |
షట్త్రింశత్తత్త్వసంభూతా షణ్ణవత్యుపశోభితా || 105 ||
షణ్ణవతితత్త్వనిత్యా షడంగశ్రుతిపారదృక్ |
షాండదేహార్ధభాగస్థా షాడ్గుణ్యపరిపూరితా || 106 ||
షోడశాక్షరమంత్రార్థా షోడశస్వరమాతృకా |
షోఢావిభక్తషోఢార్ణా షోఢాన్యాసపరాయణా || 107 ||
సకలా సచ్చిదానందా సాధ్వీ సారస్వతప్రదా |
సాయుజ్యపదవీదాత్రీ తథా సింహాసనేశ్వరీ || 108 ||
సినీవాలీ సింధుసీమా సీతా సీమంతినీసుఖా |
సునందా సూక్ష్మదర్శాంగీ సృణిపాశవిధారిణీ || 109 ||
సృష్టిస్థితిసంహారతిరోధానానుగ్రహాత్మికా |
సేవ్యా సేవకసంరక్షా సైంహికేయగ్రహార్చితా || 110 ||
సోఽహంభావైకసులభా సోమసూర్యాగ్నిమండనా |
సౌఃకారరూపా సౌభాగ్యవర్ధినీ సంవిదాకృతిః || 111 ||
సంస్కృతా సంహితా సంఘా సహస్రారనటాంగనా |
హకారద్వయసందిగ్ధమధ్యకూటమనుప్రభా || 112 ||
హయగ్రీవముఖారాధ్యా హరిర్హరపతివ్రతా |
హాదివిద్యా హాస్యభస్మీకృతత్రిపురసుందరీ || 113 ||
హాటకశ్రీసభానాథా హింకారమంత్రచిన్మయీ |
హిరణ్మయపు(ప)రాకోశా హిమా హీరకకంకణా || 114 ||
హ్రీంకారత్రయసంపూర్ణా హ్లీంకారజపసౌఖ్యదా |
హుతాశనముఖారాధ్యా హుంకారహతకిల్బిషా || 115 ||
హూం పృచ్ఛా(ష్టా)నేకవిజ్ఞప్తిః హృదయాకారతాండవా |
హృద్గ్రంథిభేదికా హృహ్లృమంత్రవర్ణస్వరూపిణీ || 116 ||
హేమసభామధ్యగతా హేమా హైమవతీశ్వరీ |
హైయంగవీనహృదయా హోరా హౌంకారరూపిణీ || 117 ||
హంసకాంతా హంసమంత్రతత్త్వార్థాదిమబోధినీ |
హస్తపద్మాలింగితామ్రనాథాఽద్భుతశరీరిణీ || 118 ||
అనృతానృతసంవేద్యా అపర్ణా చార్భకాఽఽత్మజా |
ఆదిభూసదనాకారజానుద్వయవిరాజితా || 119 ||
ఆత్మవిద్యా చేక్షుచాపవిధాత్రీందుకలాధరా |
ఇంద్రాక్షీష్టార్థదా చేంద్రా చేరమ్మదసమప్రభా || 120 ||
ఈకారచతురోపేతా చేశతాండవసాక్షిణీ |
ఉమోగ్రభైరవాకారా ఊర్ధ్వరేతోవ్రతాంగనా || 121 ||
ఋషిస్తుతా ఋతుమతీ ఋజుమార్గప్రదర్శినీ |
ౠజువాదనసంతుష్టా లృలౄవర్ణమనుస్వనా || 122 ||
ఏధమానప్రభా చైలా చైకాంతా చైకపాటలా |
ఏత్యక్షరద్వితీయాంకకాదివిద్యాస్వరూపిణీ || 123 ||
ఐంద్రా చైశ్వర్యదా చౌజా ఓంకారార్థప్రదర్శినీ |
ఔషధాయిత సాహస్రనామమంత్రకదంబకా || 124 ||
అంబా చాంభోజనిలయా చాంశభూతాన్యదేవతా |
అర్హణాఽఽహవనీయాగ్నిమధ్యగాఽహమితీరితా || 125 ||
కల్యాణీ కత్రయాకారా కాంచీపురనివాసినీ |
కాత్యాయనీ కామకలా కాలమేఘాభమూర్ధజా || 126 ||
కాంతా కామ్యా కామజాతా కామాక్షీ కింకిణీయుతా |
కీనాశనాయికా కుబ్జకన్యకా కుంకుమాకృతిః || 127 ||
కుల్లుకాసేతుసంయుక్తా కురంగనయనా కులా |
కూలంకషకృపాసింధుః కూర్మపీఠోపరిస్థితా || 128 ||
కృశాంగీ కృత్తివసనా క్లీంకారీ క్లీమ్మనూదితా |
కేసరా కేలికాసారా కేతకీపుష్పభాసురా || 129 ||
కైలాసవాసా కైవల్యపదసంచారయోగినీ |
కోశాంబా కోపరహితా కోమలా కౌస్తుభాన్వితా || 130 ||
కౌశికీ కంసదృష్టాంగీ కంచుకీ కర్మసాక్షిణీ |
క్షమా క్షాంతిః క్షితీశార్చ్యా క్షీరాబ్ధికృతవాసినీ || 131 ||
క్షురికాస్త్రా క్షేత్రసంస్థా క్షౌమాంబరసుశుభ్రగా |
ఖవాసా ఖండికా ఖాంకకోటికోటిసమప్రభా || 132 ||
ఖిలర్క్సూక్తజపాసక్తా ఖేటగ్రహార్చితాంతరా |
ఖండితా ఖండపరశుసమాశ్లిష్టకలేబరా || 133 ||
గవ్య(వయ) శృంగాభిషిక్తాంగీ గవాక్షీ గవ్యమజ్జనా |
గణాధిపప్రసూర్గమ్యా గాయత్రీ గానమాలికా || 134 ||
గార్హపత్యాగ్నిసంపూజ్యా గిరీశా గిరిజా చ గీః |
గీర్వాణీవీజనానందా గీతిశాస్త్రానుబోధినీ || 135 ||
గుగ్గులో(లూ)పేతధూపాఢ్యా గుడాన్నప్రీతమానసా |
గూఢకోశాంతరారాధ్యా గూఢశబ్దవినోదినీ || 136 ||
గృహస్థాశ్రమసంభావ్యా గృహశ్రేణీకృతోత్సవా |
గృ గ్లృ శబ్దసువిజ్ఞాత్రీ గేయగానవిగాయినీ || 137 ||
గైరికాభరణప్రీతా గోమాతా గోపవందితా |
గౌరీ గౌరవత్రైపుండ్రా గంగా గంధర్వవందితా || 138 ||
గహనా గహ్వరాకారదహరాంతఃస్థితా ఘటా |
ఘటికా ఘనసారాదినీరాజనసమప్రభా || 139 ||
ఘారిపూజ్యా ఘుసృణాభా ఘూర్ణితాశేషసైనికా |
ఘృఘౄఘ్లృ స్వరసంపన్నా ఘోరసంసారనాశినీ || 140 ||
ఘోషా ఘౌషాక్తఖడ్గాస్త్రా ఘంటామండలమండితా |
ఙకారా చతురా చక్రీ చాముండా చారువీక్షణా || 141 ||
చింతామణిమనుధ్యేయా చిత్రా చిత్రార్చితా చితిః |
చిదానందా చిత్రిణీ చిచ్చింత్యా చిదంబరేశ్వరీ || 142 ||
చీనపట్టాంశుకాలేపకటిదేశసమన్వితా |
చులుకీకృతవారాశిమునిసేవితపాదుకా || 143 ||
చుంబితస్కందవిఘ్నేశపరమేశప్రియంవదా |
చూలికా చూర్ణికా చూర్ణకుంతలా చేటికావృతా | 144 ||
చైత్రీ చైత్రరథారూఢా చోలభూపాలవందితా |
చోరితానేకహృత్పద్మా చౌక్షా చంద్రకలాధరా || 145 ||
చర్మకృష్ణమృగాధిష్ఠా ఛత్రచామరసేవితా |
ఛాందోగ్యోపనిషద్గీతా ఛాదితాండస్వశాంబరీ || 146 ||
ఛాందసానాం స్వయంవ్యక్తా ఛాయామార్తాండసేవితా |
ఛాయాపుత్రసమారాధ్యా ఛిన్నమస్తా వరప్రదా || 147 ||
జయదా జగతీకందా జటాధరధృతా జయా |
జాహ్నవీ జాతవేదాఖ్యా జాపకేష్టహితప్రదా || 148 ||
జాలంధరాసనాసీనా జిగీషా జితసర్వభూః |
జిష్ణుర్జిహ్వాగ్రనిలయా జీవనీ జీవకేష్టదా || 149 ||
జుగుప్సాఢ్యా జూతిర్జూ(జూ)ర్ణా జృంభకాసురసూదినీ |
జైత్రీ జైవాతృకోత్తంసా జోటిం(షం)గా జోషదాయినీ || 150 ||
ఝంఝానిలమహావేగా ఝషా ఝర్ఝరఘోషిణీ |
ఝింటీసుమపరప్రేమ్ణా( ప్రీతా) ఝిల్లికాకేలిలాలితా || 151 ||
టంకహస్తా టంకితజ్యా టిట్టరీవాద్యసుప్రియా |
టిట్టిభాసనహృత్సంస్థా ఠవర్గచతురాననా || 152 ||
డమడ్డమరువాద్యూర్ధ్వా ణకారాక్షరరూపిణీ |
తత్త్వజ్ఞా తరుణీ సేవ్యా తప్తజాంబూనదప్రభా || 153 ||
తత్త్వపుస్తోల్లసత్పాణిః తపనోడుపలోచనా |
తార్తీయభూపురాత్మస్వపాదుకా తాపసేడితా || 154 ||
తిలకాయితసర్వేశనిటిలేక్షణశోభనా |
తిథిస్తిల్లవనాంతఃస్థా తీక్ష్ణా తీర్థాంతలింగయుక్ || 155 ||
తులసీ తురగారూఢా తూలినీ తూర్యవాదినీ |
తృప్తా తృణీకృతారాతిసేనాసంఘమహాభటా || 156 ||
తేజినీవనమాయూరీ తైలాద్యైరభిషేచితా |
తోరణాంకితనక్షత్రా తోటకీవృత్తసన్నుతా || 157 ||
తౌణీరపుష్పవిశిఖా తౌర్యత్రికసమన్వితా |
తంత్రిణీ తర్కశాస్త్రజ్ఞా తర్కవార్తావిదూరగా || 158 ||
తర్జన్యంగుష్ఠసంలగ్నముద్రాంచితకరాబ్జికా |
థకారిణీ థాం థీం థోం థైం కృతలాస్యసమర్థకా || 159 ||
దశాశ్వరథసంరూఢా దక్షిణామూర్తిసంయుగా |
దశబాహుప్రియా దహ్రా దశాశాశాసనేడితా || 160 ||
దారకా దారుకారణ్యవాసినీ దిగ్విలాసినీ |
దీక్షితా దీక్షితారాధ్యా దీనసంతాపనాశినీ || 161 ||
దీపాగ్రమంగలా దీప్తా దీవ్యద్బ్రహ్మాండమేఖలా |
దురత్యయా దురారాధ్యా దుర్గా దుఃఖనివారిణీ || 162 ||
దూర్వాసతాపసారాధ్యా దూతీ దూర్వాప్రియప్రసూః |
దృష్టాంతరహితా దేవమాతా దైత్యవిభంజినీ || 163 ||
దైవికాగారయంత్రస్థా దోర్ద్వంద్వాతీతమానసా |
దౌర్భాగ్యనాశినీ దౌతీ దౌవారికనిధిద్వయీ || 164 ||
దండినీమంత్రిణీముఖ్యా దహరాకామధ్యగా |
దర్భారణ్యకృతావాసా దహ్రవిద్యావిలాసినీ || 165 ||
ధన్వంతరీడ్యా ధనదా ధారాసాహస్రసేచనా |
ధేనుముద్రా ధేనుపూజ్యా ధైర్యా ధౌమ్యనుతిప్రియా || 166 ||
నమితా నగరావాసా నటీ నలినపాదుకా |
నకులీ నాభినాలాగ్రా నాభావష్టదలాబ్జినీ || 167 ||
నారికేలామృతప్రీతా నారీసమ్మోహనాకృతిః |
నిగమాశ్వరథారూఢా నీలలోహితనాయికా || 168 ||
నీలోత్పలప్రియా నీలా నీలాంబా నీపవాటికా |
నుతకల్యాణవరదా నూతనా నృపపూజితా || 169 ||
నృహరిస్తుతహృత్పూర్ణా నృత్తేశీ నృత్తసాక్షిణీ |
నైగమజ్ఞానసంసేవ్యా నైగమజ్ఞానదుర్లభా || 170 ||
నౌకారూఢేశ వామోరువీక్షితస్థిరసుందరీ |
నందివిద్యా నందికేశవినుతా నందనాననా || 171 ||
నందినీ నందజా నమ్యా నందితాశేషభూపురా |
నర్మదా పరమాద్వైతభావితా పరిపంథినీ || 172 ||
పరా పరీతదివ్యౌఘా పరశంభుపురంధ్రికా |
పథ్యా పరబ్రహ్మపత్నీ పతంజలిసుపూజితా || 173 ||
పద్మాక్షీ పద్మినీ పద్మా పరమా పద్మగంధినీ |
పయస్వినీ పరేశానా పద్మనాభసహోదరీ || 174 ||
పరార్ధా పరమైశ్వర్యకారణా పరమేశ్వరీ |
పాతంజలాఖ్యకల్పోక్తశివావరణసంయుతా || 175 ||
పాశకోదండసుమభృత్ పారిపార్శ్వకసన్నుతా |
పింఛా(ఞ్జా)విలేపసుముఖా పితృతుల్యా పినాకినీ || 176 ||
పీతచందనసౌగంధా పీతాంబరసహోద్భవా |
పుండరీకపురీమధ్యవర్తినీ పుష్టివర్ధినీ || 177 ||
పూరయంతీ పూర్యమాణా పూర్ణాభా పూర్ణిమాంతరా |
పృచ్ఛామాత్రాతిశుభదా పృథ్వీమండలశాసినీ || 178 ||
పృతనా పేశలా పేరుమండలా పైత్రరక్షకీ |
పౌషీ పౌండ్రేక్షుకోదండా పంచపంచాక్షరీ మనుః || 179 ||
పంచమీతిథిసంభావ్యా పంచకోశాంతరస్థితా |
ఫణాధిపసమారాధ్యా ఫణామణివిభూషితా || 180 ||
బకపుష్పకృతోత్తంసా బగలా బలినీ బలా |
బాలార్కమండలాభాసా బాలా బాలవినోదినీ || 181 ||
బిందుచక్రశివాంకస్థా బిల్వభూషితమూర్ధజా |
బీజాపూరఫలాసక్తా బీభత్సావహదృక్త్రయీ || 182 ||
బుభుక్షావర్జితా బుద్ధిసాక్షిణీ బుధవర్షకా |
బృహతీ బృహదారణ్యనుతా వృహస్పతీడితా || 183 ||
బేరాఖ్యా బైందవాకార వైరించసుషిరాంతరా |
బోద్ధ్రీ బోధాయనా బౌద్ధదర్శనా బంధమోచనీ || 184 ||
భట్టారికా భద్రకాలీ భారతీభా భిషగ్వరా |
భిత్తికా భిన్నదైత్యాంగా భిక్షాటనసహానుగా || 185 ||
భీషణా భీతిరహితా భువనత్రయశంకరా |
భూతఘ్నీ భూతదమనీ భూతేశాలింగనోత్సుకా || 186 ||
భూతిభూషితసర్వాంగీ భృగ్వంగిరమునిప్రియా |
భృంగినాట్యవినోదజ్ఞా భైరవప్రీతిదాయినీ || 187 ||
భోగినీ భోగశమనీ భోగమోక్షప్రదాయినీ |
భౌమపూజ్యా భండహంత్రీ భగ్నదక్షక్రతుప్రియా || 188 ||
మకారపంచమీ మహ్యా మదనీ మకరధ్వజా |
మత్స్యాక్షీ మధురావాసా మన్వశ్రహృదయాశ్రయా || 189 ||
మార్తాండవినుతా మాణిభద్రేడ్యా మాధవార్చితా |
మాయా మారప్రియా మారసఖీడ్యా మాధురీమనాః || 190 ||
మాహేశ్వరీ మాహిషఘ్నీ మిథ్యావాదప్రణాశినీ |
మీనాక్షీ మీనసంసృష్టా మీమాంసాశాస్త్రలోచనా || 191 ||
ముగ్ధాంగీ మునివృందార్చ్యా ముక్తిదా మూలవిగ్రహా |
మూషికారూఢజననీ మూఢభక్తిమదర్చితా || 192 ||
మృత్యుంజయసతీ మృగ్యా మృగాలేపనలోలుపా |
మేధాప్రదా మేఖలాఢ్యా మేఘవాహనసేవితా || 193 ||
మేనాత్మజా మైథిలీశకృతార్చనపదాంబుజా |
మైత్రీ మైనాకభగినీ మోహజాలప్రణాశినీ || 194 ||
మోదప్రదా మౌలిగేందుకలాధరకిరీటభాక్ |
మౌహూర్తలగ్నవరదా మంజీరా మంజుభాషిణీ || 195 ||
మర్మజ్ఞాత్రీ మహాదేవీ యమునా యజ్ఞసంభవా |
యాతనారహితా యానా యామినీపూజకేష్టదా || 196 ||
యుక్తా యూపా యూథికార్చ్యా యోగా యోగేశయోగదా | (యక్షరాజసఖాంతరా)
రథినీ రజనీ రత్నగర్భా రక్షితభూరుహా || 197 ||
రమా రసక్రియా రశ్మిమాలాసన్నుతవైభవా |
రక్తా రసా రతీ రథ్యా రణన్మంజీరనూపురా || 198 ||
రక్షా రవిధ్వజారాధ్యా రమణీ రవిలోచనా |
రసజ్ఞా రసికా రక్తదంతా రక్షణలంపటా || 199 ||
రక్షోఘ్నజపసంతుష్టా రక్తాంగాపాంగలోచనా |
రత్నద్వీపవనాంతఃస్థా రజనీశకలాధరా || 200 ||
రత్నప్రాకారనిలయా రణమధ్యా రమార్థదా |
రజనీముఖసంపూజ్యా రత్నసానుస్థితా రయిః || 201 ||
|| ఇతి శ్రీయోగనాయికా అథవా శ్రీ రాజరాజేశ్వరీ సహస్రనామ స్తోత్రం సంపూర్ణం ||