Skip to content

# Choose Language:

Endaro Mahanubhavulu Lyrics in Telugu – ఎందరో మహానుభావులు

endaro mahanubhavulu lyrics in telugu englishPin

Endaro Mahanubhavulu is a very popular keerthana by Sri Tyagaraja, who composed it after listening to the performance of Shri Shatkala Govinda Marar. This kriti was a dedication to all the great maestros and performers through the ages. Entharo Mahanu Bhavulu is one of the Pancharatna Kriti’s of Thyagaraja. Get Endaro mahanubhavulu Lyrics in Telugu Pdf here.

Endaro Mahanubhavulu Lyrics in Telugu – ఎందరో మహానుభావులు  

ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు ||

చందురు వర్ణుని అంద చందమును
హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు |

సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య
మూర్ధన్యులెందరో మహానుభావులు అందరికీ వందనములు || 1 ||

మానస వన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 2 ||

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 3 ||

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 4 ||

హరి గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు
భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 5 ||

హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల
జుచుచును పులక శరీరులై ఆనంద పయోధి
నిమగ్నులై ముదంబునను యశము గల
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 6 ||

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || 7 ||

నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను
వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల
జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద
కిర్తనము జేయు వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 8 ||

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములను
శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల
భావంబుల నెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 9 ||

ప్రేమ ముప్పిరి గొన్న వేళ నామము దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన
వారెందరో మహానుభావులు అందరికీ వందనములు || 10 ||

ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు ||

3 thoughts on “Endaro Mahanubhavulu Lyrics in Telugu – ఎందరో మహానుభావులు”

  1. It is beyond the capabilities of any human being to comment about this song.It is a divine outpouring of love towards HIM.We can enrich ourself enormousy by listening to it any number of times and improve our understanding of the song.You are sure to find something new and enlightening every time we listen the song.We are all blessed.
    g v reddy
    mob 9902934739

  2. ముఖ్యమైన త్యాగరాజ కృతులు, (వాటి తాత్పర్యములు/అనువాదములు+వ్యాఖ్యానములు) సరళమైన తెలుగులో, పుస్తక రూపంలో కానీ లేదా online లో (internet) లో దొరికే విధంగా నాకు ఎవరైనా సహాయము చేయగలరని ప్రార్థన.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి