Skip to content

# Choose Language:

Jaya Jaya Rama Samara Vijaya Rama Lyrics in Telugu – జయ జయ రామ సమర విజయ రామ

Jaya Jaya Rama is a popular Annamayya Keerthana on Lord Rama. Get Jaya Jaya Rama Samara Vijaya Rama Lyrics in Telugu Pdf here and chant it for the grace of Lord Rama.

Jaya Jaya Rama Samara Vijaya Rama Lyrics in Telugu – జయ జయ రామ సమర విజయ రామ 

జయ జయ రామ సమర విజయ రామ |
భవహర నిజభక్తి పారీణ రామ || పల్లవి ||

జలధి బంధించిన సౌమిత్రి రామ |
సెలవిల్లు విరచిన సీతారామ |
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ |
కలిగి యజ్ౙము గాచే కౌసల్య రామ || చరణం 1 ||

అరి రావణాంతక ఆదిత్య కులరామ |
గురుమౌనులను గాచే కోదండరామ |
ధర నహల్యపాలిటి దశరథ రామ |
హరురాణి నుతుల లోకాభిరామ || చరణం 2 ||

అతి ప్రతాపముల మాయామౄగాంతక రామ |
నుత కుశలవ ప్రియ సుగుణరామ |
వితత మహిమల శ్రీ వేంకటాద్రి రామ |
మతిలోన బాయని మనువంశ రామ || చరణం 3 ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి