Skip to content

# Choose Language:

Ramachandrudithadu Raghuveerudu Lyrics in Telugu – రామచంద్రుడితడు రఘువీరుడు

Ramachandrudithadu Raghuveerudu is a popular Annamayya keerthana on Lord Rama. Get Ramachandrudithadu Raghuveerudu Lyrics in Telugu Pdf here and recite it for the grace of Lord Rama.

Ramachandrudithadu Raghuveerudu Lyrics in Telugu – రామచంద్రుడితడు రఘువీరుడు 

రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి | పల్లవి |

గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము | చరణం 1 |

పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము | చరణం 2 |

తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు | చరణం 3 |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి