Skip to content

# Choose Language:

Anurenu Paripoornamaina Roopamu Lyrics in Telugu – అణురేణు పరిపూర్ణమైన రూపము

Anurenu Paripoorna maina Roopamu Lyrics - Annamayya KeerthanaPin

Anurenu Paripoornamaina Roopamu is a popular keerthana on Lord Venkateswara by Annamacharya. The rendition of this keerthana is performed by many renowned singers over the time. Get Anurenu Paripoornamaina Roopamu Lyrics in Telugu Pdf here and recite it for the grace of Lord Venkateswara.

Anurenu Paripoornamaina Roopamu Lyrics in Telugu – అణురేణు పరిపూర్ణమైన రూపము 

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి యంజనాద్రిమీఁది రూపము ॥పల్లవి॥

వేదాంతవేత్తలెల్లా వెదకేటి రూపము
ఆదినంత్యములేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించు రూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము ॥చ1॥

పాలజలనిధిలోనఁ బవళించే రూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదే శేషగిరిమీఁది రూపము ॥చ2॥

ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము
కొంచని మఱ్ఱాకుమీఁది కొన రూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచఁగ శ్రీవేంకటాద్రినిదే రూపము ॥చ3॥

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

2218