Moosina Muthyalakele is a popular Annamayya keerthana on Tirumala Lord Venkateswara. Get Moosina Muthyalakele Lyrics in Telugu Pdf here.
Moosina Muthyalakele Lyrics in Telugu – మూసిన ముత్యాలకేలే
మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు ॥
కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీ కొప్పున కేలే చేమంతులు ।
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పైపై కమ్మని నీ మేనికి ॥
భారపు గుబ్బల కేలే పయ్యెద నీ
బీరపు జూపుల కేలే పెడమోము ।
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ॥
ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి ।
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి ॥