Rava Durgamma Thalli is a popular devotional song of Goddess Durga Devi. Get Rava Durgamma Thalli Song Lyrics in Telugu below.
Rava Durgamma Thalli Song Lyrics in Telugu – రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
రవ్వల పందిళ్ళలోన ముత్యాల ముగ్గులేసి
ముత్యాల ముగ్గులోనా, రతనాల రాశి పోసి
రతనాల రాశి పైన పీటలే వేసినావు
రావా రావా రావా రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
ఆ, ఎర్రమాల వేసినాము ఎర్రబట్ట కట్టినాము
ఉదయం సంధ్య వేళలోన స్నానాలే చేసినాము
పసుపుకుంకాల తోటి పూజలెన్నో చేసినాము
రావా రావా రావా రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
మల్లెపూలు తెచ్చినాము మాలలే వేసినాము
వేపాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము
మేళా తాళాల తోటి భజనలే చేసినాము
రావా రావా, ఆ రావా రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
ఆ, మంత్రాతంత్రాల తోటి కలశ పూజ చేసినాము
పులిహోర పొంగల్లు నైవేద్యం పెట్టినాము
కర్పూరం వెలిగించి హారతులే ఇచ్చేము
రావా రావా, ఆ రావా రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి
రవ్వల పందిళ్ళలోన ముత్యాల ముగ్గులేసి
ముత్యాల ముగ్గులోనా రతనాల రాశి పోసి
రతనాల రాశి పైన పీటలే వేసినావు
రావా రావా, ఆ రావా రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి

