Pallikattu Sabarimalaikku is a very popular Ayyappa Bhajana song. Get Pallikattu Sabarimalaikku Lyrics in Telugu below.
Pallikattu Sabarimalaikku Lyrics in Telugu – పల్లికట్టు శబరిమలైకి
ఇరుముడితోటి నిను మదినింపి కదిలేము స్వామి,
అండగనుండి నీడగనిలిచి దీక్షను కావవయ్యా
పల్లికట్టు శబరిమలైకి కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే (2)
పల్లికట్టు శబరిమలైకి కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే (2)
నెయ్యాభిషేకం చెయ్యండి, హారతులిచ్చి కొలవండి
ఇరుముడి స్వామికి భక్తిగ ఇచ్చి, వేదన తీరగ వేడండి, అయ్యప్పను కని పిలవండి
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే (2)
వేకువ జామున నిద్రనులేచి, శీతల స్నానము శ్రద్దగా చేసి
మాలను దాల్చి శీఘ్రముగా, దీక్షారంబము చేసితిని
గణపతి షణ్ముక అయ్యప్ప స్వాముల ప్రాతఃకాలపు వేళల తలచి
స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షచేసితిని
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే (2)
ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని, ముదమున కొలిచి సేవించి
నల్లని దుస్తులు ధరించి, శ్రీ శని భగవానుని కొలిచెదము
కాలికి చెప్పులు లేకయే తిరుగుచు అయ్యప్పలనే శృతియించితి
సంధ్యా సేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచెదను
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే (2)
భజనలు చేసే స్వాములగృహములు వెతికే వెళ్ళితిమి
పడి పూజలతో మణిధరుని, జ్యోతిగ చూచి మురిసితిని
స్వామి ప్రసాదము సేవించి, నేలను నిద్దుర పోయితిని,
మండలమంతా ఇటులే అయ్యప్పను నే కొలిచితిని
దేహబలందా – పాద బలందా (2)
స్వామి ఇచ్చిన ధైర్యముతోటి దీక్షను ముగియించి
గురు స్వామిని గని భక్తితో కొలచి ఇరుముడి దాల్చితిని, నే ఇరుముడి దాల్చితిని
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే (2)
సత్య వాక్కులను పలుకుచూనే, స్వామి నామము తలచితినీ
దుశ్చింతలు మదిలో మాని, అయ్యప్పను యద దాల్చితిని, మానస మందున మురిసితిని
పదినెనిమిది మెట్లెక్క తలచితిని, అయ్యప్ప స్వామినే కాంచేదనూ,
మకర జ్యోతిని చూసెదను, స్వామి సన్నిధిలో నన్ను నే మరచెదను
పల్లికట్టు శబరిమలైకి కల్లుమ్ ముల్లుమ్ కాలికిమెతై
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే (2)
శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప (6)

