Skip to content

# Choose Language:

Jagadananda Karaka Lyrics in Telugu – జగదానంద కారకా

Jagadananda Karaka LyricsPin

Jagadananda Karaka is a keerthana on Lord Rama by Shri Tyagaraja. Get Jagadananda Karaka Lyrics in Telugu Pdf here and chant it for the grace of Lord Rama.

Jagadananda Karaka Lyrics in Telugu – జగదానంద కారకా 

జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా

గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
సదా సకల జగదానంద కారకా |

అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా నగధర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక
జగదానంద కారకా |

నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ
జగదానంద కారకా ||

ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
జగదానంద కారకా |

పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
జగదానంద కారకా |

సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర
శచీపతి నుతాబ్ది మదహరా నురాగరాగ రాజితకధా సారహిత
జగదానంద కారకా |

సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరణావ గుణ సురగణ మదహరణ సనాతనాజనుత
జగదానంద కారకా |

ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప
వాసవరిపు జనకాంతక కలాధరా కలాధరాప్త కరుణాకర
శరణాగత జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
జగదానంద కారకా |

కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
జగదానంద కారకా |

పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ
విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత
జగదానంద కారకా |

అగణిత గుణ కనక చేల పాల విడలనారుణాభ సమాన చరణాపార
మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ
నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
జగదానంద కారకా ||

జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి