Skip to content

Hanuman Badabanala Stotram in Telugu – హనుమాన్ బడబానల స్తోత్రం

Hanuman Badabanala Stotram or Hanuman Vadvanal StotraPin

Hanuman Badabanala Stotram is a very powerful mantra that was written by Ravana’s brother Vibhishana. In this stotram, Vibhishana praises the power of Hanuman and also prays for protection from all diseases, diseases, enemies, fears, troubles. By chanting Hanuman Badabanala Stotram for forty days, with devotion and meditation, one can get rid of all kinds of problems, especially the one’s related to health. All kinds of fever, ghosts and enemies will be eliminated. Impossible can be achieved by chanting this hymn. Get Hanuman Badabanala Stotram in telugu Lyrics Pdf here and chant it to get rid of all ailments and evils.

రావణాసురిడి సోదరుడు విభీషణ విరచితం ఈ హనుమత్ బడబానల స్తోత్రం. హనుమంతుని శక్తి స్తుతిస్తూ మొదలయ్యి, అన్ని రుగ్మతల నుండి, అనారోగాల నుండి శత్రువుల నుండి కాపాడమని వేడుకుంటూ భయాల నుండి ఇబ్బందుల నుండి, సర్వారిష్టాల నుండి విముక్త లని చేయమని కోరుతూ చివరగా స్వామి వారి ఆశీస్సులు, ఆరోగ్యం అన్నిట సఫలీక్రుతులం అయ్యేటట్టు దీవించమని సాగుతుంది.

ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము. గురువుల, గురుతుల్యులైన పెద్దలు అనుమతితో నలభై ఒక్క రోజులు లేదా వారి ఉపదేశం ప్రకారం భక్తీ శ్రద్దలతో పారాయణం చేస్తే అన్ని రకాల సమస్యలు ముఖ్యం గా ఆరోగ్యపరమైన వాటినుండి తప్పక ఉపసమనం లభిస్తుందని పెద్దల ఉవాచ. హనుమత్ బడబానల స్తోత్రం ఈ స్తోత్రము నిత్యమూ పఠించదగినది. దీనివలన శత్రువులు సులభముగా జయింప బడుదురు. సకల విధములైన జ్వరములు భూతప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును. అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.

Hanuman Badabanala Stotram in Telugu – హనుమాన్ బడబానల స్తోత్రం 

ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః, శ్రీ బడబానల హనుమాన్ దేవతా, మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీసీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే |

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే ప్రకట పరాక్రమ సకలదిఙ్మండల యశోవితాన ధవళీకృత జగత్త్రితయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురీ దహన, ఉమా అనలమంత్ర ఉదధిబంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీగర్భసంభూత, శ్రీరామలక్ష్మణానందకర, కపిసైన్యప్రాకార సుగ్రీవ సాహాయ్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మచారిన్, గంభీరనాద సర్వపాపగ్రహవారణ, సర్వజ్వరోచ్చాటన, డాకినీ విధ్వంసన,

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరవీరాయ, సర్వదుఃఖనివారణాయ, గ్రహమండల భూతమండల సర్వపిశాచ మండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవ జ్వరాన్ ఛింది ఛింది, యక్ష రాక్షస భూతప్రేతపిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ,

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే,

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి,

ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే శ్రవణచక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హర హర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ,

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే సర్వ గ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకలబంధన మోక్షణం కురు కురు శిరఃశూల గుల్ఫశూల సర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ
నాగ పాశ అనంత వాసుకి తక్షక కర్కోటక కాళీయాన్ యక్ష కుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా,

రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యాచ్ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశతౄన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా |

ఇతి శ్రీ విభీషణకృతం హనుమాన్ బడబానల స్తోత్రం సంపూర్ణం ||

3 thoughts on “Hanuman Badabanala Stotram in Telugu – హనుమాన్ బడబానల స్తోత్రం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి