Antharyami Alasithi Solasithi is a keerthana by Annamacharya on Lord Venkateswara. Get Antharyami Alasithi Solasithi Lyrics in Telugu Pdf here. Its in Abhogi Ragam.
Antharyami Alasithi Solasithi Lyrics in Telugu – అంతర్యామి అలసితి సొలసితి
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని
కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక
జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక
రాగం: ఆభోగి