Anthayu Neeve is a popular Annamayya keerthana. Get Anthayu Neeve Lyrics in Telugu Pdf here and chant it for the grac eof Lord Venkateswara.
Anthayu Neeve Lyrics in Telugu – అంతయు నీవే హరి పుండరీకాక్ష
అంతయు నీవే హరి పుండరీకాక్ష – చెంతనాకు నీవే శ్రీ రఘురామ… (2)
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కులమును నీవే గోవిందుడా నా – కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా – నెలవును నీవే నీరజనాభ
తనువును నీవే దామోదర నా – మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విఠ్ఠలుడా నా – వెనకముందు నీవే విష్ణు దేవుడా
పుట్టుగు నీవే పురుషోత్త మ – కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు – నెట్టన గతి ఇంక నీవే నీవే