Skip to content

# Choose Language:

Kana Kana Ruchira Lyrics in Telugu – కన కన రుచిరా

kana kana ruchira lyrics - కన కన రుచిరా

కనకన రుచిర ఒక త్యాగరాజ పంచరత్న కృతి. ఈ కృతి లో రాముని అందమైన ముఖాన్ని చూస్తూ ఎంతో ఆనందం పొందానని త్యాగరాజు వివరించెను. రాముని దయను వివరించడానికి, ధ్రువునికి శాశ్వత స్థానం ఇచ్చినది, జటాయు పక్షికి మోక్షం ప్రసాదించినది వంటి ఉదాహరణలు ప్రస్తావించెను. రాముని కరుణకు ఎలాంటి హద్దులు లేవని చెప్పెను.

మిగిలిన త్యాగరాజ పంచరత్న  కృతులు – “సాధించేనే”, “జగదానంద కారక“, “దుడుకుగల నన్నే“, “ఎందరో మహానుభావులు“.

Kana Kana Ruchira is one of the Pancharatna Kriti’s of Tyagaraja on Lord Rama. In this Kriti Tyagaraja says that he found great joy in looking at the beautiful face of Lord Rama, which has a special, magical charm. He talks about Rama’s kindness by giving examples, like granting Dhruva an eternal place and giving salvation to the bird Jatayu. He explains that Rama’s mercy has no limits. Get Kana Kana Ruchira Lyrics in Telugu here and chant it for the grace of Lord Rama.

 The other pancharatna kriti’s are “Sadhinchene”, “Jagadananda Karaka”, “Dudukugala Nanne”, and “Endaro Mahannubhavulu”.

Kana Kana Ruchira in Telugu – కన కన రుచిరా

కన కన రుచిరా కనక వసన నిన్ను

దిన దినమును అనుదిన దినమును
మనసున చనువున నిన్ను
కన కన రుచిర కనక వసన నిన్ను

పాలుగారు మోమున
శ్రీయపార మహిమ కనరు నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

కళకళమను ముఖకళ గలిగిన సీత
కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

బాలాకాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర
సరసిజాక్ష వర కపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ
కన కన రుచిరా కనక వసన నిన్ను

సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల
చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖియింపగ లేదా యటు
కన కన రుచిరా కనక వసన నిన్ను

మృదమద లలామ శుభానిటిల వర జటాయు మోక్ష ఫలద
పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి
వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త
సురభూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథంగ
పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే
కన కన రుచిరా కనక వసన నిన్ను

కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొను
వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి
మరియు నారద పరాశర శుక శౌనక పురంధర నగజా ధరజ
ముఖ్యులు సాక్షి గాదా సుందరేశ సుఖ కలశాంబుధి వాసా శ్రితులకే
కన కన రుచిరా కనక వసన నిన్ను

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత
ముఖజిత కుముదహిత వరద నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

కన కన రుచిరా

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి