Skip to content

# Choose Language:

Alara Chanchalamaina Lyrics in Telugu – అలర చంచలమైన

Alara Chanchalamaina Lyrics - Annamayya KeerthanaPin

Alara Chanchalamaina is a popular Annamayya keerthana on Tirumala Lord Venkateswara. Get Alara Chanchalamaina Lyrics in Telugu Pdf here.

Alara Chanchalamaina Lyrics in Telugu – అలర చంచలమైన ఆత్మలందుండ 

అలర చంచలమైన ఆత్మలందుండ
నీయలవాటు సేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాసపవనమందుండ
నీ భావంబు దెలిపె నీవుయ్యాల ॥పల్లవి॥

ఉదయాస్త శైలంబు లొనరఁ గంభములైన
అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబునిండె నీవుయ్యాల
పదిలముగ వేదములు బంగారుచేరులై
పట్ట వెరపై తోఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై
మిగుల వర్ణింప నరుదాయె నుయ్యాల ॥చ1॥

మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల
మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీలశైలమువంటి నీమేని కాంతికిని
నిజమైన తొడవాయె నుయ్యాల
పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ
భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని
భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల ॥చ2॥

కమలకును భూసతికి కదలు కదలుకు
మిమ్ముఁ గౌఁగిలింపఁగఁ జేసె నుయ్యాల
అమరాఁగనలకు నీ హావభావ విలాస
మందంద చూపె నీవుయ్యాల
కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై
గణుతింప నరుదాయ నుయ్యాల
కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు
కడువేడుకై వుండె నుయ్యాల ॥చ3॥

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి