Skip to content

# Choose Language:

Akhila Devatha Kruthi Maha Ganapathi Song – అఖిల దేవతాకృతి

Akhila Devatha Kruthi Maha Ganapathi Song LyricsPin

Akhila Devatha Kruthi Maha Ganapathi is a very popular song on Lord Ganesha. Get Akhila Devata Kruthi song lyrics in Telugu here.

Akhila Devatha kruthi Maha Ganapathi Song Telugu Lyrics – అఖిల దేవతాకృతి మహాగణపతి 

అఖిల దేవతాకృతి మహాగణపతి
అనేక రూపాల సామి ఆదిగణపతి
అఖిల దేవతాకృతి మహాగణపతి
అనేక రూపాల సామి ఆదిగణపతి

మహాగణపతి మహాగణపతి
మహాగణపతి ఆదిగణపతి
మహాగణపతి మహాగణపతి
మహాగణపతి ఆదిగణపతి

అఖిల దేవతాకృతి మహాగణపతి
అనేక రూపాల సామి ఆదిగణపతి
అనేక రూపాల సామి ఆదిగణపతి

విఘ్నములను తొలగించే విఘ్న గణపతి
సాధనాలకు ఫలములిచ్చే సిద్ధ గణపతి
లక్షణముగా జగతినేలె లక్ష్మి గణపతి
సాంబశివుని సన్నిధి హేరంబ గణపతి
కరుణతో మొరలువినే శూర్పకర్ణ గణపతి
కలిమికి కాణాచి రత్న గర్భ గణపతి
సర్వజ్ఞుడు సర్వదర్శి సాక్షి గణపతి
చండపాప హరుడు వీడు డుంబి గణపతి

మహాగణపతి మహాగణపతి
మహాగణపతి ఆదిగణపతి

అండనిచ్చి కాచే వక్రతుండ గణపతి
పార్వతి ఒడిలో వెలిగే బాల గణపతి
చేరి వెంటనే యేలే క్షిప్ర గణపతి
యోగ భోగ కారకుడీ యోగ గణపతి
చింతితార్ధములు తీర్చే చింతామణి గణపతి
తరగని సిరులిచ్చే ఏకదంత గణపతి
వెనకబడని విజయములిచ్చే వీర గణపతి
నాదమయుడు కళామూర్తి నాట్య గణపతి

మహాగణపతి మహాగణపతి
మహాగణపతి ఆదిగణపతి

రాజిల్లే విక్రమాల రాజ గణపతి
ఆదిత్య స్వరూపుడీ అర్క గణపతి
జివ్హయందు రాజిల్లే ఉచ్చిష్ట గణపతి
సర్వము నడిపించు వేల్పు శక్తి గణపతి

మహాగణపతి మహాగణపతి
మహాగణపతి ఆదిగణపతి

అఖిల దేవతాకృతి మహాగణపతి
అనేక రూపాల సామి ఆదిగణపతి
అఖిల దేవతాకృతి మహాగణపతి
అనేక రూపాల సామి ఆదిగణపతి

మహాగణపతి మహాగణపతి
మహాగణపతి ఆదిగణపతి
మహాగణపతి మహాగణపతి
మహాగణపతి ఆదిగణపతి

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి