Vishwaksena Ashtottara Shatanamavali is the 108 names of Vishwaksena, who is the son of Varuna, and the commander-in-chief of the army of Lord Vishnu. Further, he is also the dwarapala of Vaikunta. Get Vishwaksena Ashtottara Shatanamavali in Telugu Pdf Lyrics here and chant the 108 names of Vishwaksena.
Vishwaksena Ashtottara Shatanamavali in Telugu – శ్రీ విష్వక్సేన అష్టోత్తరశతనామావళిః
ఓం శ్రీమత్సూత్రవతీనాథాయ నమః |
ఓం శ్రీవిష్వక్సేనాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం శ్రీవాసుదేవసేనాన్యాయ నమః |
ఓం శ్రీశహస్తావలంబదాయ నమః |
ఓం సర్వారంభేషుసంపూజ్యాయ నమః |
ఓం గజాస్యాదిపరీవృతాయ నమః |
ఓం సర్వదాసర్వకార్యేషు సర్వవిఘ్ననివర్తకాయ నమః |
ఓం ధీరోదాత్తాయ నమః | ౯
ఓం శుచయే నమః |
ఓం దక్షాయ నమః |
ఓం మాధవాజ్ఞా ప్రవర్తకాయ నమః |
ఓం హరిసంకల్పతో విశ్వసృష్టిస్థితిలయాదికృతే నమః |
ఓం తర్జనీముద్రయా విశ్వనియంత్రే నమః |
ఓం నియతాత్మవతే నమః |
ఓం విష్ణుప్రతినిధయే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం విష్ణుమార్గానుగాయ నమః | ౧౮
ఓం సుధియే నమః |
ఓం శంఖినే నమః |
ఓం చక్రిణే నమః |
ఓం గదినే నమః |
ఓం శార్ఙ్గిణే నమః |
ఓం నానాప్రహరణాయుధాయ నమః |
ఓం సురసేనానందకారిణే నమః |
ఓం దైత్యసేనభయంకరాయ నమః |
ఓం అభియాత్రే నమః | ౨౭
ఓం ప్రహర్త్రే నమః |
ఓం సేనానయవిశారదాయ నమః |
ఓం భూతప్రేతపిశాచాది సర్వశత్రునివారకాయ నమః |
ఓం శౌరివీరకథాలాపినే నమః |
ఓం యజ్ఞవిఘ్నకరాంతకాయ నమః |
ఓం కటాక్షమాత్రవిజ్ఞాతవిష్ణుచిత్తాయ నమః |
ఓం చతుర్గతయే నమః |
ఓం సర్వలోకహితకాంక్షిణే నమః |
ఓం సర్వలోకాభయప్రదాయ నమః | ౩౬
ఓం ఆజానుబాహవే నమః |
ఓం సుశిరసే నమః |
ఓం సులలాటాయ నమః |
ఓం సునాసికాయ నమః |
ఓం పీనవక్షసే నమః |
ఓం విశాలాక్షాయ నమః |
ఓం మేఘగంభీరనిస్వనాయ నమః |
ఓం సింహమధ్యాయ నమః |
ఓం సింహగతయే నమః | ౪౫
ఓం సింహాక్షాయ నమః |
ఓం సింహవిక్రమాయ నమః |
ఓం కిరీటకర్ణికాముక్తాహార కేయూరభూషితాయ నమః |
ఓం అంగుళీముద్రికాభ్రాజదంగుళయే నమః |
ఓం స్మరసుందరాయ నమః |
ఓం యజ్ఞోపవీతినే నమః |
ఓం సర్వోత్తరోత్తరీయాయ నమః |
ఓం సుశోభనాయ నమః |
ఓం పీతాంబరధరాయ నమః | ౫౪
ఓం స్రగ్విణే నమః |
ఓం దివ్యగంధానులేపనాయ నమః |
ఓం రమ్యోర్ధ్వపుండ్రతిలకాయ నమః |
ఓం దయాంచితదృగంచలాయ నమః |
ఓం అస్త్రవిద్యాస్ఫురన్మూర్తయే నమః |
ఓం రశనాశోభిమధ్యమాయ నమః |
ఓం కటిబంధత్సరున్యస్తఖడ్గాయ నమః |
ఓం హరినిషేవితాయ నమః |
ఓం రత్నమంజులమంజీరశింజానపదపంకజాయ నమః | ౬౩
ఓం మంత్రగోప్త్రే నమః |
ఓం అతిగంభీరాయ నమః |
ఓం దీర్ఘదర్శినే నమః |
ఓం ప్రతాపవతే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వశక్తయే నమః |
ఓం నిఖిలోపాయకోవిదాయ నమః |
ఓం అతీంద్రాయ నమః |
ఓం అప్రమత్తాయ నమః | ౭౨
ఓం వేత్రదండధరాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం సమయజ్ఞాయ నమః |
ఓం శుభాచారాయ నమః |
ఓం సుమనసే నమః |
ఓం సుమనసః ప్రియాయ నమః |
ఓం మందస్మితాంచితముఖాయ నమః |
ఓం శ్రీభూనీళాప్రియంకరాయ నమః |
ఓం అనంతగరుడాదీనాం ప్రియకృతే నమః | ౮౧
ఓం ప్రియభూషణాయ నమః |
ఓం విష్ణుకింకరవర్గస్య తత్తత్ కార్యోపదేశకాయ నమః |
ఓం లక్ష్మీనాథపదాంభోజషట్పదాయ నమః |
ఓం షట్పదప్రియాయ నమః |
ఓం శ్రీదేవ్యనుగ్రహప్రాప్త ద్వయమంత్రాయ నమః |
ఓం కృతాంతవిదే నమః |
ఓం విష్ణుసేవితదివ్యస్రక్ అంబరాదినిషేవిత్రే నమః |
ఓం శ్రీశప్రియకరాయ నమః |
ఓం శ్రీశభుక్తశేషైకభోజనాయ నమః | ౯౦
ఓం సౌమ్యమూర్తయే నమః |
ఓం ప్రసన్నాత్మనే నమః |
ఓం కరుణావరుణాలయాయ నమః |
ఓం గురుపంక్తిప్రధానాయ నమః |
ఓం శ్రీశఠకోపమునేర్గురవే నమః |
ఓం మంత్రరత్నానుసంధాత్రే నమః |
ఓం న్యాసమార్గప్రవర్తకాయ నమః |
ఓం వైకుంఠసూరి పరిషన్నిర్వాహకాయ నమః |
ఓం ఉదారధియే నమః | ౯౯
ఓం ప్రసన్నజనసంసేవ్యాయ నమః |
ఓం ప్రసన్నముఖపంకజాయ నమః |
ఓం సాధులోకపరిత్రాతే నమః |
ఓం దుష్టశిక్షణతత్పరాయ నమః |
ఓం శ్రీమన్నారాయణపద శరణత్వప్రబోధకాయ నమః |
ఓం శ్రీవైభవఖ్యాపయిత్రే నమః |
ఓం స్వవశంవద మాధవాయ నమః |
ఓం విష్ణునా పరమం సామ్యమాపన్నాయ నమః |
ఓం దేశికోత్తమాయ నమః | ౧౦౮
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః | ౧౦౯
ఇతి శ్రీ విష్వక్సేనాష్టోత్తరశతనామావళిః |