Vinaro Bhagyamu is a popular keerthana by Annamayya on Lord Venkateswara. Get Vinaro Bhagyamu Lyrics in Telugu Pdf here.
Vinaro Bhagyamu Lyrics in Telugu – వినరో భాగ్యము విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ |
వెనుబలమిదివో విష్ణు కథ || పల్లవి
ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణు కథ |
నాదించీనిదె నారదాదులచే
వీధి వీధులనే విష్ణు కథ ||
వినరో భాగ్యము విష్ణు కథ |
వెనుబలమిదివో విష్ణు కథ || పల్లవి
వదలక వేదవ్యాసులు నుడిగిన
విదిత పావనము విష్ణు కథ |
సదనంబయినది సంకీర్తనయై
వెదకిన చోటనే విష్ణు కథ ||
వినరో భాగ్యము విష్ణు కథ |
వెనుబలమిదివో విష్ణు కథ || పల్లవి
గొల్లెతలు చల్లలు గొనకొని చిలకగ
వెల్లివిరియాయె విష్ణు కథ |
యిల్లిదే శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లి గొలిపె నీ విష్ణు కథ ||
వినరో భాగ్యము విష్ణు కథ |
వెనుబలమిదివో విష్ణు కథ || పల్లవి