Vendukondama is a popular keerthana by Annamayya on Lord Venkateswara. Get Vedukondama Lyrics in Telugu Pdf here and chant it for the grace of Lord Venkateswara.
Vedukondama Lyrics in Telugu – వేడుకొందామా వేంకటగిరి
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని || ప ||
ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు |
తోమని పళ్యాలవాడె దురిత దూరుడే || చ1 ||
వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు |
గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే || చ2 ||
ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు |
అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే || చ3 ||