Skip to content

Sri Krishna Tandava Stotram in Telugu – శ్రీ కృష్ణ తాండవ స్తోత్రం

Sri Krishna Tandava StotramPin

Get sri krishna tandava stotram in telugu lyrics here and chant it with devotion for the grace of Lord Sri Krishna.

Sri Krishna Tandava Stotram in Telugu – శ్రీ కృష్ణ తాండవ స్తోత్రం 

భజే వ్రజైకనందనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం |
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసారగం నమామి సాగరం భజే || ౧ ||

మనోజగర్వమోచనం విశాలఫాలలోచనం
విఘాతగోపశోభనం నమామి పద్మలోచనం |
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణ వారణం || ౨ ||

కదంబసూనకుండలం సుచారుగండమండలం
వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం |
యశోదయా సమోదయా సకోపయా దయానిధిం
హ్యులూఖలే సుదుస్సహం నమామి నందనందనం || ౩ ||

నవీనగోపసాగరం నవీనకేళిమందిరం
నవీన మేఘసుందరం భజే వ్రజైకమందిరం |
సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దరాతినందబాలకః సమస్తభక్తపాలకః || ౪ ||

సమస్త గోపసాగరీహ్రదం వ్రజైకమోహనం
నమామి కుంజమధ్యగం ప్రసూనబాలశోభనం |
దృగంతకాంతలింగణం సహాస బాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవం || ౫ ||

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపావనం
సదా సుఖైకదాయకం నమామి గోపనాయకం |
సమస్త దోషశోషణం సమస్త లోకతోషణం
సమస్త దాసమానసం నమామి కృష్ణబాలకం || ౬ ||

సమస్త గోపనాగరీ నికామకామదాయకం
దృగంతచారుసాయకం నమామి వేణునాయకం |
భవో భవావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతే కిశోరకం నమామి దుగ్ధచోరకం || ౭ ||

విముగ్ధముగ్ధగోపికా మనోజదాయకం హరిం
నమామి జంబుకాననే ప్రవృద్ధవహ్ని పాయనం |
యథా తథా యథా తథా తథైవ కృష్ణ సర్వదా
మయా సదైవగీయతాం తథా కృపా విధీయతామ్ || ౮ ||

ఇతి శ్రీ కృష్ణ తాండవ స్తోత్రం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి