Skip to content

# Choose Language:

Sai Baba Dandakam in Telugu – శ్రీ సాయి బాబా దండకం

Sai Baba Dandakam or Sainatha DandakamPin

Get Sri Shiridi Sai Baba Dandakam in Telugu Lyrics here and chant it with devotion for the grace of Lord Sai Baba. This is also popular as Sainatha Dandakam.

Sai Baba Dandakam in Telugu – శ్రీ సాయి బాబా దండకం 

శ్రీ సాయిదేవా ! షిరిడీ నివాసా ! నిన్ను గొల్వగా లేరు బ్రహ్మాదు లైనన్ నినుం గొల్వ నేనెంతవాడన్ జగంబెల్ల నీ వల్లనే పుట్టి గిట్టుంగదా ! నీ మహాత్మ్యoబుచే తన సర్వరో గాదులున్ సర్వరాగాదులన్ సర్వకష్టాదులన్ దీరుగాదే శ్రీ సాయిబాబా నిన్న వ్యాయానంద సంధాయి వంచున్ సమస్తంబు నీవే యటంచున్ మనంబందు నిన్నున్ ఘనంబొప్పగా గొల్తు నీమూర్తి సూర్యుండు నీరూపు సోముండు నీవారయున్ త్రిమూర్త్యాత్మకంబైన తేజంబుగదా |

మహాత్మా భక్తులన్ గావగా నీవు యీ లోకమందున్ షిరిడియన్ పురమునన్ శ్రీ సాయి యను పేరుతో భక్తిలోకాళ నెల్లన్ పాలింపగా నీవు వేమ్చేసితివయ్యా మహాత్మా మానవుల్ నిన్ను యే వేళయంధైన యేకష్టమంధైన ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం యంచున్ మనస్పూర్తిగా గొల్తురో వారినత్యంతకారుణ్యధృష్టిన్ విలోకించికాపాడుమయ్యా నీదే భారమయ్యా

నమస్తే నమస్తే నమస్తే నమః

1 thought on “Sai Baba Dandakam in Telugu – శ్రీ సాయి బాబా దండకం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి