Nigama Nigamantha is an Annamayya keerthana on Lord Venkateswara. Below is Annamayya Nigama Nigamantha Lyrics in Telugu, and lyrics of the song based on the same keerthana from the popular devotional film Annamayya (1996).
Nigama Nigamantha Lyrics in Telugu – నిగమ నిగమాంత
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుఁడ శ్రీ నారాయణా ॥పల్లవి॥
దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్య-
నోపకకదా నన్ను నొడఁబరుపుచు
పైపైనె సంసార బంధములఁ గట్టేవు
నాపలుకు చెల్లునా నారయణా ॥చ1॥
చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ-
లేకకా నీవు బహులీల నన్ను
కాకుసేసెదవు బహుకర్మములఁ బడువారు
నాకొలఁదివారలా నారాయణా ॥చ2॥
వివిద నిర్బంధముల వెడలఁద్రోయక నన్ను
భవసాగరములఁ దడఁబడఁ జేతురా
దివి జేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీత చోర శ్రీ నారాయణా ॥చ3॥
Nigama Nigamantha Song Lyrics in Telugu (Annamayya Movie 1996) – నిగమ నిగమాంత
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీ నారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు… పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా… నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా… నారాయణ
నిగమ… గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ లక్ష్మి నారాయణ
నీస గస గస గస గస గ
దని సగ మగ సగ మగ సనిదస నీసాద
సగమ గమగ మదని దనిస మగ సనీద మగస
వివిధ నిర్భందముల
వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ… హరే
హరే
హరే
దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీ నారాయణ
నిగమ
సగ మగ సని దమ గని
నిగమ గస మగ దమనిదస నిగమ
నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
వేద నారాయణ వెంకట నారాయణ
తిరుమల నారాయణ
కలియుగ నారాయణ
హరి హరి నారాయణ ఆది నారాయణ
లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
హరే హరే