Maa Papala Tholaginchu is a very popular song from the movie Sri Shiridi Sai baba Mahathyam (1986). The lyrics were penned by Sri Aatreya, music was conducted by Ilayaraja, and the song was sung by Yesudas. Get Maa Papala Tholanginchu song lyrics in Telugu Pdf here.
Maa Papala Tholaginchu lyrics in Telugu – మా పాపాల తొలగించు
మా పాపాల తొలగించు దీపాల నీవె వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య
మా పాపాల తొలగించు దీపాల నీవె వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య
పసిపాప మనసున్న ప్రతి మనిషిలోను పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్ధుడవుతాడని
గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసన్లు వేరైనా, వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివీ
మా తడిలేని హ్రుదయాల దయతోటి తడిపి తలుపుల్ని తీసేస్తివి
మాలో కలతల్ని మాపేస్తివి
మా పాపాల తొలగించు దీపాల నీవె వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య
పెడుతుంటె పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయా
వారి బాధల్ని మోసావయా
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నీ వాసమాయె ధన్యులమైనామయ్య
మాకు దైవమై వెలిశావయా
మా పాపాల తొలగించు దీపాల నీవె వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య
తరియించినామయ్యా… మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా … మేము తరియించినామయ్యా