Lele Baba Nidura Levayya is a very popular devotional song on Sri Shiridi Sai Baba from the Telugu movie Kunti Putrudu (1993). The music was composed by Ilayaraja and the song was sung by SP Bala Subrahmanyam. Get Le le Baba Nidura levayya song lyrics in Telugu here.
Lele Baba Nidura Levayya Song Lyrics in Telugu – లేలే బాబా నిదుర లేవయ్యా
లేలే బాబా నిదుర లేవయ్యా, ఏలే స్వామీ మేలుకోవయ్య
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా, బాబా
లేలే లేలే లేలే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
వేగుచుక్క తిలకమెట్టి, వేదమంత్ర పువ్వులు పెట్టి
ఈ ఈ ఈ, ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ
వేగుచుక్క తిలకమెట్టి, వేదమంత్ర పువ్వులు పెట్టి
పాదసేవ చేసుకునే, వేల దాటిపోయెనని
ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికీ
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ
అందుకనె గుండె, నీ గురు పీఠమయినది
ఆరాధ్య దైవమని, కొనియాడుతున్నది
అంతకుమించిన భాగ్యమేదిరా… బాబా
లేలే బాబా నిదుర లేవయ్యా, ఏలే స్వామీ మేలుకోవయ్య
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా, బాబా
లేలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామీ మేలుకోవయ్యా
నీలకంఠ స్వామిలో, నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో, దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివీ నీవేనని
రూపములనేకములయిన శ్రీ సాయిని
నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై
కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై
వెన్నంటి నువ్వుంటే లోటే లేదుగా, బాబా
లేలే బాబా నిదుర లేవయ్యా, ఏలే స్వామీ మేలుకోవయ్య
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా, బాబా
లేలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామీ మేలుకోవయ్యా