Sai Mangala Harathi in Telugu – శ్రీ సాయి మంగళహారతి
స్వామి సాయినాథాయ శిరిడీ క్షేత్రవాసాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం || స్వామి ||
లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ
నాగలోక స్తుత్యాయ నవ్యమంగళం || స్వామి ||
భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ
ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం || స్వామి ||
సత్యతత్త్వ బోధకాయ సాధువేషాయతే
నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం || స్వామి ||