Kalabhairava (or Kala bhairava) is one of the most fearsome avatars of Lord Shiva. This form of Lord Shiva was described by Adi Shankaracharya in the Kalabhairava Ashtakam Stotram. He is depicted as dark, naked, with three eyes, and entwined with snakes, and wearing a garland of skulls. Adi Shankaracharya praises lord Kalabhairava in Kalabhairavastakam as the Lord of death/time, and also, as the lord of the city of Kashi. Get Kalabhairava Ashtakam in telugu lyrics here and chant to get immense benefits, especially getting freed from shoka (grief), moha (attachment), lobha (greed), dainya (poverty), kopa (anger), and tapa (suffering).
కాలభైరవుడు శివుని అత్యంత రౌద్ర అవతారాలలో ఒకటి. కాలభైరవుని రూపాన్ని ఆదిశంకరాచార్యులు కాలభైరవ అష్టకం లో వర్ణించారు. అతను నలుపు వర్ణము తో, నగ్నంగా, మూడు కళ్లతో మరియు పాములతో అల్లుకున్నట్లుగా మరియు పుర్రెల దండను ధరించినట్లు వర్ణించ బడెను. ఆదిశంకరాచార్యుల వారు కాలభైరవాష్టకంలో కాలభైరవుడిని మృత్యువు/కాలానికి అధిపతిగా మరియు కాశీ నగర క్షేత్రపాలకుని గా కీర్తించారు. కాల భైరవ అష్టకం జపించడం ద్వారా శోక (శోకం), మోహ (అనుబంధం), లోభ (దురాశ), దైన్యం (పేదరికం), కోప (కోపం), తప (బాధ) నుండి విముక్తి పొందండి.
Kalabhairava Ashtakam in Telugu – కాలభైరవాష్టకం
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ || 9 ||
ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |