Bhavamulona Bahyamunandunu is a very popular Annamacharya keerthana in praise of Lord Venkateswara of Tirumala. Get Bhavamulona Bahyamunandunu Lyrics in Telugu Pdf here.
Bhavamulona Bahyamunandunu in Telugu – భావములోన బాహ్యమునందును
భావములోన బాహ్యమునందును |
గోవింద గోవిందయని కొలువవో మనసా || పల్లవి
హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు |
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా || చరణం 1
అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు |
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా || చరణం 2
విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు |
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా || చరణం 3
హరి యే సర్వము ఆ నామము మధురం
సర్వేజన సుఖింనోభవంతు