Vinayaka Nee Murthike Song is one of the popular songs of Lord Ganesha. Get Vinayaka Nee Murthike Song Lyrics in Telugu Pdf here and recite it for worshipping Lord Ganesha and getting mental peace.
Vinayaka Nee Murthike Song Lyrics in Telugu – వినాయకా నీ మూర్తికే
వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయకా నీ మూర్తిక మా మొదటి ప్రణామం
నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం
నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం
వినాయకా నీ మూర్తిక మా మొదటి ప్రణామం
వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
లక్ష్మీ రమణుడు శ్రీ హరి కూడా తలచును నీ శుభనామం
వాణీ బ్రహ్మలు కూరిమి తోడ చేతురు నీ గుణగానం
పార్వతి దేవి హృదయ విహారి… ఈఈ ఈ ఈ
పార్వతి దేవి హృదయ విహారి… శివస్మృతి గణనాథ
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
విఘ్న వినాశక వేద స్వరూప, షణ్ముఖ సోదర స్వామి
దత్తాత్రేయ అయ్యప్ప రూప, ప్రమధా థీశ నమామి
తల్లివి నీవే తండ్రివి నీవే, ఆఆ ఆ ఆ ఆ…
తల్లివి నీవే తండ్రివి నీవే, సకలము నీవయ్యా, ఆ ఆ ఆ…
వినాయక నీ ముర్తికే శత కోటి ప్రణామం
వినాయక నీ ముర్తికే శత కోటి ప్రణామం
పాపవినాశక శుభ స్వరూపా, పార్వతి తనయా స్వామి
బొజ్జ వినాయక సిద్ది వినాయక, ఉండ్రాళ్ళ ప్రియుడివి నీవే
జీవం నీవే ప్రాణం నీవే, ఆఆ ఆ ఆ ఆ…
జీవం నీవే ప్రాణం నీవే, సర్వం నీవయ్యా ఆ ఆ ఆ…
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయక నీ ముర్తికే శత కోటి ప్రణామం
నీవు కొలువున్న మా మనసే, నిరతమూ ఆనంద ధామం
నీవు కొలువున్న మా మనసే, నిరతమూ ఆనంద ధామం
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి