Skip to content

# Choose Language:

Vinayaka Chavithi Pooja Vidhanam 2024 – వినాయక చవితి పూజా విధానం

Vinayaka Chavithi Pooja Vidhanam or Siddhi Vinayaka Vratha KalpamPin

Vinayaka Chavithi Pooja Vidhanam is the pooja procedure to follow for worshipping Lord Ganesha on the day of Vinayaka Chavithi. It is also called Vinayaka Vratha Kalpam.

Vinayaka Chavithi Pooja Vidhanam 2024 – వినాయక చవితి పూజా విధానం 

శ్రీ మహాగణాధిపతయే నమః |
శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓం |

శుచిః 

(తలమీద నీళ్ళను జల్లుకోండి)

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||

(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే ||

ఆచమ్య

ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణాయ నమః |

దీపారాధనం

(దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి)

దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||

భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ||

దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||

భూతోచ్ఛాటనం 

(అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, ఇది చదివి, మీ వెనుక వేసుకోండి)

ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే |
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా |

ప్రాణాయామం 

(ప్రాణాయామం చేయండి)

ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

సంకల్పం

(అక్షింతలు తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి)
(కింద అండర్లైన్ చేసిన పదాల వరకు, మీరు నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి మారవచ్చు. మీరు భారత దేశం లోని తెలుగు రాష్ట్రాలలో ఉన్నట్లైతే ఇక్కడ వ్రాసి ఉన్నదే చదవండి.)

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే  కృష్ణ గోదావరి నద్యోః మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ క్రోధి (2024) నామ సంవత్సరే ఉత్తర/దక్షిణ/పశ్చిమ/ఈశాన్య ఆయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం తిథౌ చిత్తా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ (మీ గోత్రం) గోత్రః (మీ పేరు) నామధేయః (మమ ధర్మపత్నీ సమేతః) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే ||

|| వినాయక పూజా ప్రారంభః ||

ప్రార్థన

భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ |
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే ||
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ||
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ |
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ||

ధ్యానం 
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్ |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి |

ఆవాహనం 
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి |

ఆసనం 
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి |

అర్ఘ్యం 
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి |

పాద్యం 
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి |

ఆచమనీయం 
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం 
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ |
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం 
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం 
గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః |
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం 
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ |
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ |
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి |

అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |

పుష్పాణి
సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ |
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి |

అథాంగపూజా

ఓం పార్వతీనందనాయ నమః | పాదౌ పూజయామి (పాదములను) |
ఓం గణేశాయ నమః | గుల్ఫౌ పూజయామి (చీలమండను) |
ఓం జగద్ధాత్రే నమః | జంఘే పూజయామి (మోకాలుక్రింద) |
ఓం జగద్వల్లభాయ నమః | జానునీ పూజయామి (మోకాలు చిప్ప) |
ఓం ఉమాపుత్రాయ నమః | ఊరూ పూజయామి (తొడలను) |
ఓం వికటాయ నమః | కటిం పూజయామి (నడుమును పూజింపవలెను) |
ఓం గుహాగ్రజాయ నమః | గుహ్యం పూజయామి (మర్మ స్థానములను) |
ఓం మహోత్తమాయ నమః | మేఢ్రం పూజయామి |
ఓం నాథాయ నమః | నాభిం పూజయామి (బొడ్డును) |
ఓం ఉత్తమాయ నమః | ఉదరం పూజయామి (పొట్టను) |
ఓం వినాయకాయనమః | వక్షఃస్థలం పూజయామి (ఛాతిని) |
ఓం పాశచ్ఛిదేనమః | పార్శ్వే పూజయామి (పక్కలను) |
ఓం హేరంబాయ నమః | హృదయం పూజయామి (హృదయము) |
ఓం కపిలాయనమః | కంఠం పూజయామి (కంఠమును) |
ఓం స్కందాగ్రజాయ నమః | స్కంధౌ పూజయామి (భుజములను) |
ఓం హరసుతాయ నమః | హస్తౌ పూజయామి (చేతులను) |
ఓం బ్రహ్మచారిణే నమః | బాహున్ పూజయామి (బాహువులను) |
ఓం సుముఖాయ నమః | ముఖం పూజయామి (ముఖమును) |
ఓం ఏకదంతాయ నమః | దంతౌ పూజయామి (దంతములను) |
ఓం విఘ్ననేత్రే నమః | నేత్రే పూజయామి (కన్నులను) |
ఓం శూర్పకర్ణాయనమః | కర్ణౌ పూజయామి (చెవులను) |
ఓం ఫాలచంద్రాయనమః | లలాటం పూజయామి (నుదురును) |
ఓం నాగాభరణాయనమః | నాసికాం పూజయామి (ముక్కును) |
ఓం చిరంతనాయ నమః | చుబుకం పూజయామి (గడ్డము క్రింది భాగమును) |
ఓం స్థూలోష్ఠాయ నమః | ఓష్ఠౌ పూజయామి (పై పెదవిని) |
ఓం గళన్మదాయ నమః | గండే పూజయామి (గండమును) |
ఓం కపిలాయ నమః | కచాన్ పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును) |
ఓం శివప్రియాయై నమః | శిరః పూజయామి (శిరస్సును) |
ఓం సర్వమంగళాసుతాయ నమః | సర్వాణ్యంగాని పూజయామి (సర్వ అవయవములను) |

ఏకవింశతి పత్ర పూజ (21 ఆకులు)

ఓం ఉమాపుత్రాయ నమః | మాచీపత్రం సమర్పయామి (దర్భ) |
ఓం హేరంబాయ నమః | బృహతీపత్రం సమర్పయామి (నేలములక) |
ఓం లంబోదరాయ నమః | బిల్వపత్రం సమర్పయామి (మారేడు) |
ఓం ద్విరదాననాయ నమః | దూర్వాపత్రం సమర్పయామి (గరిక) |
ఓం ధూమకేతవే నమః | ధత్తూరపత్రం సమర్పయామి (ఉమ్మెత్త) |
ఓం బృహతే నమః | బదరీపత్రం సమర్పయామి (రేగు) |
ఓం అపవర్గదాయ నమః | అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి) |
ఓం ద్వైమాతురాయ నమః | తులసీపత్రం సమర్పయామి (తులసి) |
ఓం చిరంతనాయ నమః | చూతపత్రం సమర్పయామి (మామిడి ఆకు) |
ఓం కపిలాయ నమః | కరవీరపత్రం సమర్పయామి (గన్నేరు) |
ఓం విష్ణుస్తుతాయ నమః | విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు) |
ఓం ఏకదంతాయ నమః | దాడిమీపత్రం సమర్పయామి (దానిమ్మ) |
ఓం అమలాయ నమః | ఆమలకీపత్రం సమర్పయామి (దేవదారు) |
ఓం మహతే నమః | మరువక పత్రం సమర్పయామి (మరువము) |
ఓం సింధూరాయ నమః | సింధువార పత్రం సమర్పయామి (వావిలి) |
ఓం గజాననాయ నమః | జాతీ పత్రం సమర్పయామి (జాజిపత్రి) |
ఓం గండగళన్మదాయ నమః | గండవీ పత్రం సమర్పయామి (తెల్లగరికె) |
ఓం శంకరప్రియాయ నమః | శమీ పత్రం సమర్పయామి (జమ్మి) |
ఓం భృంగరాజత్కటాయ నమః | అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి) |
ఓం అర్జునదంతాయ నమః | అర్జునపత్రం సమర్పయామి (మద్ది) |
ఓం అర్కప్రభాయ నమః | అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు) |

ఏకవింశతి పుష్ప పూజ – (21 పుష్పాలు)

ఓం పంచాస్య గణపతయే నమః | పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం మహా గణపతయే నమః | మందార పుష్పం సమర్పయామి |
ఓం ధీర గణపతయే నమః | దాడిమీ పుష్పం సమర్పయామి |
ఓం విష్వక్సేన గణపతయే నమః | వకుళ పుష్పం సమర్పయామి |
ఓం ఆమోద గణపతయే నమః | అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి |
ఓం ప్రమథ గణపతయే నమః | పాటలీ పుష్పం సమర్పయామి |
ఓం రుద్ర గణపతయే నమః | ద్రోణ పుష్పం సమర్పయామి |
ఓం విద్యా గణపతయే నమః | ధత్తూర పుష్పం సమర్పయామి |
ఓం విఘ్న గణపతయే నమః | చంపక పుష్పం సమర్పయామి |
ఓం దురిత గణపతయే నమః | రసాల పుష్పం సమర్పయామి |
ఓం కామితార్థప్రద గణపతయే నమః | కేతకీ పుష్పం సమర్పయామి |
ఓం సమ్మోహ గణపతయే నమః | మాధవీ పుష్పం సమర్పయామి |
ఓం విష్ణు గణపతయే నమః | శమ్యాక పుష్పం సమర్పయామి |
ఓం ఈశ గణపతయే నమః | అర్క పుష్పం సమర్పయామి |
ఓం గజాస్య గణపతయే నమః | కల్హార పుష్పం సమర్పయామి |
ఓం సర్వసిద్ధి గణపతయే నమః | సేవంతికా పుష్పం సమర్పయామి |
ఓం వీర గణపతయే నమః | బిల్వ పుష్పం సమర్పయామి |
ఓం కందర్ప గణపతయే నమః | కరవీర పుష్పం సమర్పయామి |
ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః | కుంద పుష్పం సమర్పయామి |
ఓం బ్రహ్మ గణపతయే నమః | పారిజాత పుష్పం సమర్పయామి |
ఓం జ్ఞాన గణపతయే నమః | జాతీ పుష్పం సమర్పయామి |

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక)

ఓం గణాధిపాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం పాశాంకుశధరాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఆఖువాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం వినాయకాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఈశపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఏకదంతాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఇభవక్త్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం మూషకవాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కుమారగురవే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కపిలవర్ణాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం బ్రహ్మచారిణే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం మోదకహస్తాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సురశ్రేష్ఠాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం గజనాసికాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కపిత్థఫలప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం గజముఖాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సుప్రసన్నాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సురాగ్రజాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఉమాపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం స్కందప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి |

అష్టోత్తరశతనామ పూజ

శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళీ  | (అష్టోత్రం చదవండి)

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |

ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః దీపం దర్శయామి |

నైవేద్యం
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ |
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |

తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి |

నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా |
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం
గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్రాఘనాశన |
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ||
ఏకదంతైకవదన తథా మూషకవాహన |
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణం
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ||
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ||
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
మమాభీష్టప్రదో భూయో వినాయక నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి |

ప్రార్థన
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ||
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ |
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి |

రాజోపచార పూజా
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఛత్రమాచ్ఛాదయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | చామరైర్వీజయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గీతం శ్రావయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | నృత్యం దర్శయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | వాద్యం ఘోషయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఆందోళికాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | అశ్వాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గజాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక |
గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక |
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |

నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |

గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక |
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |

సమర్పణం
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |

శ్రీ వినాయక చవితి కథ | (వినాయక వ్రతం కథ చదవండి)

శ్రీ వినాయక మంగళ హారతి | ( హారతి సమర్పించండి)

3 thoughts on “Vinayaka Chavithi Pooja Vidhanam 2024 – వినాయక చవితి పూజా విధానం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి