Nava Narasimha Namo Namo is a popular Annamayya keerthana. Get Nava Narasimha Namo Namo Lyrics in Telugu Pdf here and recite it for the grace of Lord Venkateswara of Tirumala.
Nava Narasimha Namo Namo – నవ నారసింహ నమో నమో
నవనారసింహ నమో నమో
భవనాశితీర యహోబలనారసింహ ॥పల్లవి॥
సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహ
వితతవీరసింహవిదారాణా
అతిశయకరుణ యోగానంద నరసింహ
మతి శాంతపు కానుగుమాని నారసింహ ॥చ1॥
మరలి బీభత్సపుమట్టెమళ్ల నరసింహ
నరహరి భార్గోటి నారసింహ
పరిపూర్ణ శృంగార ప్రహ్లద నరసింహ
సిరుల నద్భుతపు లక్ష్మీ నారసింహ ॥చ2॥
వదనభయానకపు వరాహ నరసింహ
చెదరని వైభవాల శ్రీనరసింహ
అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి
పదివేలురూపముల బహునారసింహ ॥చ3॥