Skip to content

Lingashtakam Lyrics in Telugu – లింగాష్టకం – బ్రహ్మమురారి సురార్చిత లింగం

lingashtakam Lyrics pdf - brahma murari surarchita lingam - lingastakamPin

Lingashtakam is an eight verse stotram dedicated to the worship of lord shiva in his “Linga” form. It is also popular with its starting verse “Brahma Murari Surarchita Lingam”. It is believed that reciting Lingastakam gives you mental peace. It is also said that with regular chanting of Lingashtakam with utmost devotion one can attain moksha and reach Shivaloka. Get Lingashtakam Lyrics in Telugu pdf here and chant with devotion to get the grace of Lord Shiva.

లింగాష్టకం ఒక “అష్టకం” (ఎనిమిది చరణాలు కూడిన ఒక స్తోత్రం). ఇది శివుడిని ఆరాధించేటప్పుడు జపించబడుతుంది. లింగాష్టకం “లింగ” రూపంలో శివుని ఆరాధనకు అంకితం చేయబడింది. లింగాష్టక స్తోత్రాన్ని తరుచుగా చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, చెడు మరియు చెడ్డ అలవాట్ల నుండి క్రమంగా దూరం అవుతారు. లింగాష్టక స్తోత్రాన్ని గొప్ప భక్తి తో పఠించడం వలన శివలోకాన్ని చేరుతారని పెద్దల నమ్మకం.

Lingashtakam Lyrics in Telugu – లింగాష్టకం 

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగం ।
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 1 ॥

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం ।
రావణదర్పవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 2 ॥

సర్వసుగన్ధిసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగం ।
సిద్ధసురాసురవన్దిత లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 3 ॥

కనకమహామణిభూషిత లింగం
ఫనిపతివేష్టిత శోభిత లింగం ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగం ।
సంచితపాపవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం ।
దినకరకోటిప్రభాకర లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥  6 ॥

అష్టదలోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగం ।
అష్టదరిద్రవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్ప సదార్చిత లింగం ।
పరమపదం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥  8 ॥

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

ఇతి శ్రీ లింగాష్టకం ||

6 thoughts on “Lingashtakam Lyrics in Telugu – లింగాష్టకం – బ్రహ్మమురారి సురార్చిత లింగం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి