Kondalalo Nelakonna Koneti Rayadu Vadu is a very popular Annamayya Keerthana on Lord Venkateswara of Tirmumala. Get Kondalalo Nelakonna Lyrics in Telugu Pdf here and chant recite it for the grace of Lord Venkateswara.
Kondalalo Nelakonna Lyrics in Telugu – కొండలలో నెలకొన్న కోనేటిరాయడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు ॥ పల్లవి ॥
కుమ్మరదాసుఁడైన కురువరతినంబి
ఇమ్మన్నవరములెల్ల నిచ్చినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాంజక్కురవర్తి
రమ్మనచోటికి వచ్చి నమ్మినవాఁడు ॥ చ1 ॥
అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్నుమోఁచినవాఁడు
మచ్చిక దొలఁకఁ దిరుమలనంబితోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు ॥ చ2 ॥
కంచిలోన నుండఁ దిరుకచ్చినంబిమీఁదఁ గరు-
ణించి తనయెడకు రప్పించినవాఁడు
యెంచ నెక్కుడైనవేంకటేశుఁడు మనలకు
మంచివాఁడై కరుణఁ బాలించినవాఁడు ॥ చ3 ॥