Chandrasekhara Ashtakam is a 8 stanza devotional hymn revering Lord Shiva as ‘Chandasekhara’, which literally means One who adorns his crown with the Moon (Chandra – Moon, Sekhara – Crown). Chandrasekharashtakam was written by Markandeya, a great devotee of Lord Shiva. Get Sri Chandrasekhara Ashtakam in Telugu lyrics Pdf here and chant it with devotion for the grace of Lord Shiva.
‘చందశేఖర’ అంటే తన కిరీటాన్ని చంద్రునితో అలంకరించేవాడు (చంద్ర – చంద్రుడు, శేఖర – కిరీటం). చంద్రశేఖర అష్టకం శివుడిని స్తుతించే 8 చరణాలతో కూడిన శక్తివంతమైన శ్లోకం. శివుని గొప్ప భక్తుడైన మార్కండేయుడు, చంద్రశేఖరాష్టకం రచించెను. శివుని కృప పొందుటకు భక్తి తో చంద్రశేఖర అష్టకం జపించండి.
Chandrasekhara Ashtakam in Telugu – చంద్రశేఖరాష్టకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం ‖
రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం |
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ‖ 1 ‖
మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం |
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ‖ 2 ‖
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరం |
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ‖ 3 ‖
పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహం |
భస్మదిగ్ద కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ‖ 4 ‖
యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరం |
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ‖ 5 ‖
భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం |
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ‖ 6 ‖
విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినం |
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ‖ 7 ‖
భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం |
సోమవారిన భోహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః ‖ 8 ‖
ఇతి శ్రీ చంద్రశేఖరాష్టకం సంపూర్ణం ||
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి