Alarulu Kuriyaga is a popular Annamayya keerthana. Get Alarulu Kuriyaga Lyrics in Telugu Pdf here and recite it for the grace of Lord Venkateswara of Tirumala.
Alarulu Kuriyaga Lyrics in Telugu – అలరులు కురియగ
అలరులు కురియగ నాడెనదే
అలకలఁ గులుకుల నలమేల్ మంగ ॥పల్లవి॥
అరవిరి సొబగుల నతివలు మెచ్చఁగ
అరతెర మరఁగున నాడెనదే
వరుస పూర్వదువాళపు తిరుపుల
హరిఁగరగింపుచు నలమేల్ మంగ ॥చ1॥
మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడపుల దాఁటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ ॥చ2॥
చిందుల పాటల శిరి పొలయాటల
అందెల మోఁతల నాడెనదే
కందువ తిరువేంకటపతి మెచ్చఁగ
అందపు తిరుపుల నలమేల్ మంగ ॥చ3॥