Ye Teeruga Nanu Lyrics in Telugu – ఏ తీరుగ నను దయ చూచెదవో
ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా
శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా
క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా
వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా