Tiruveedhula Merasi is a popular keerthana on Lord Venkateswara by Annamacharya. In this, Annamayya tries to describe the 10 days of processions and the Vahana’s of the Lord in the Malaveedhulu of Tirumala. Get Tiruveedhula Merasi Lyrics in Telugu Pdf here and recite it for the grace of Lord Venkateswara.
Tiruveedhula Merasi Lyrics in Telugu – తిరువీధుల మెరసీ దేవదేవుడు
తిరువీధుల మెరసీ దేవదేవుడు |
గరిమల మించిన సింగారములతోడను || ప ||
తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు |
సిరుల రెండవనాడు శేషుని మీద |
మురిపాల మూడవనాడు ముత్యాల పందిరిక్రింద |
పొరినాలుగవనాడు పువ్వు గోవిలలోను || చ1 ||
గ్రక్కున నైదవనాడు గరుడునిమీద |
యెక్కెను నారవనాడు యేనుగుమీద |
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను |
యిక్కువ దేరును గుర్రమెనిమిదవనాడు || చ2 ||
కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు |
పెనచి పదోనాడు పెండ్లిపీట |
యెనసి శ్రీవేంకటేశు డింతి యలమేల్మంగతో |
వనితల నడుమను వాహనాలమీదను || చ3 ||
maku Manchi songs petandi