Skip to content

# Choose Language:

Takkuvemi Manaku Lyrics in Telugu – తక్కువేమి మనకూ

Takkuvemi manaku Lyrics - Ramadasu KeerthanaPin

Takkuvemi Manaku Lyrics in Telugu – తక్కువేమి మనకూ 

పల్లవి

తక్కువేమి మనకూ
రాముం-డొక్కడుండు వరకూ

చరణములు

ప్రక్కతోడుగా భగవంతుడు
మన చక్రధారియై చెంతనె ఉండగా ॥ చ 1 ॥

మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ
మత్సమూర్తి మనపక్షమునుండగా ॥ చ 2 ॥

భూమిస్వర్గములు పొందుగ గొలచిన
వామనుండు మనవాడై యుండగ ॥ చ 3 ॥

దశగ్రీవుముని దండించిన ఆ
ధశరధ రాముని దయ మనకుండగ ॥ చ 4 ॥

దుష్టకంసునీ దుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై గృపతో నుండగ ॥ చ 5 ॥

రామదాసుని గాచెడి శ్రీ
మన్నారాయణి నెరనమ్మియుండగ ॥ చ 6 ॥

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి