Skip to content

# Choose Language:

Siva Siva Sankara Song Lyrics in Telugu – శివ శివ శంకర హర హర శంకర

Siva Siva Sankara Song LyricsPin

Siva Siva Sankara Hara Hara Sankara is a popular devotional song of Lord Shiva form the Movie Damarukam (2012). Get Siva Siva Sankara Song Lyrics in Telugu here.

Siva Siva Sankara Song Lyrics in Telugu – శివ శివ శంకర హర హర శంకర 

భం భం భో – భం భం భో
భం భం భో – భం భం భో
భం భం భో – భం భం భో
భం భం భో – భం భం భో

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

ఓం పరమేశ్వరా పరా
ఓం నిఖిలేశ్వరా హరా
ఓం జీవేశ్వరేశ్వరా కనరారా
ఓం మంత్రేశ్వరా స్వరా
ఓం యాంత్రేేశ్వరా స్థిరా
ఓం తంత్రేశ్వరావరా రావేరా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

ఆకాశలింగమై ఆవహించరా
డమ డమమని డమరుఖ ధ్వని సలిపి
జడతని వదిలించరా
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి
చలనమే కలిగించరా

భస్మం చేసేయ్ అసురునే అగ్నిలింగమై ప్రవికారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా
వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరునించరా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

విశ్వేశ లింగమై కనికరించరా
విధి లిఖితమునిక బర బర బర చెరిపి
అమృతమె కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా
పలు శుభములు గని అభయములిడి హితము
సతతము అందించరా

గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వరా
ప్రాణం నీవై ఆలింగనంమీరా
ఎదలో కొలువై హర హర ఆత్మా లింగమై నిలబడరా
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

శివ శివ హర హర జయ జయ దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా – భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా-భం భం భో
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా -భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి