Rama Lali is a devotional song, which is a lullaby to Lord Rama. Get Sri Rama Lali in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Rama.
Rama Lali in Telugu – రామ లాలీ
రామ లాలీ రామ లాలీ
రామ లాలీ రామ లాలీ ||
రామ లాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ |
అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ||
జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ||
ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు ||