Pahi Rama Prabho is a keerthana on Lord Rama by Sri Ramadasu. Get Sri Pahi Rama Prabho Lyrics in Telugu here and recite it for the grace of Sri Rama.
Pahi Rama Prabho Lyrics in Telugu – పాహి రామప్రభో
పల్లవి
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో
చరణములు
ఇందిరా హృదయారవిందాధి రూఢ
సుందరాకార నానంద రామప్రభో
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద శ్యామప్రభో || చ 1 ||
బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్షితానంద రామప్రభో
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో || చ 2 ||
నీదు బాణంబులను నాదు షతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో || చ 3 ||
శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారె కును వింతగా చదువు రామప్రభో
శ్రీ రామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో || చ 4 ||
కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో || చ 5 ||
పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైల రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో || చ 6 ||