Skip to content

Neelakandhara Divya Mandira Song Lyrics in Telugu – నీలకంధరా దివ్య మందిరా

Neelakandhara Divya Mandira Song Lyrics

Neelakandhara Divya Mandira Song Lyrics in Telugu – నీలకంధరా దివ్య మందిరా 

నీలకంధరా దివ్యమందిరా ఉమాసుందరా దేవా
ఫాలలోచన భస్మరంజనా భుజగభూషణా దేవ
యోగకర్మాణి నిర్వికల్పాది నిర్మలానంద భావా
సర్వభక్తాని సకలలోకాది ముక్తిపథమే నీ సేవ నిత్యపూజలే అందు బృందము నీదువంశమే కాదా ( 2 )

సకలసంధాత్రి పార్వతీదేవి సగమై
నిలిచె నీ యదను అర్ధనారీశ్వరంమై
ప్రకృతీ దివ్య శక్తి లా నీకు తోడై
నిన్ను నిలిపేను సృష్టికే మూలరూపై

దాహార్తితో ఓం శివ ఓం
ధరసొక్కగా ఓం శివ ఓం
దాహార్తితో ధరసొక్కగా
నింగినుండి నీదు ఝటను చొరబడి ఇలను కాచే సురగంగా
హర ఓం హర హర హర
నీలకంధరా…

బుద్ధి కౌసల్య సర్వసిద్యార్థ యుతుడై
పేరుపొందేను గణపతే నీకుసుతుడై
సకలసురకోటి సేన కే తాను ప్రభువై
నీదు కమరుండు పూజలందేను ఇలపై

మహిదురితమే ఓం శివ ఓం
మితిమీరగా ఓం శివ ఓం
మహిదురితమే మితిమీరగా మహిషి చంపి జనుల బ్రోచె హరిహర సంభూతుడై అయ్యప్పే
హర ఓం హర హర హర
ఉమాసుందరా…

తపోమార్గాన నిన్ను చేరి వెలుగొందే
నందికేశుడే ముముఖ్షుల గురువయ్యే
నీదు హృదయాంతరంగుడై చెలగు భృంగే
భక్త బృందాల నిత్య ఆరాధనొందే
ప్రమథాధిపా ఓం శివ ఓం
నీ గణములే ఓం శివ ఓం
ప్రమథాధిపా నీ గణములే దుర్మదా౦న్ధ దుష్ట దక్ష అవగుణ సంహారులే శివ శంభో
హర ఓం హర హర హర

నీలకంధరా దివ్యమందిరా ఉమాసుందరా దేవా
ఫాలలోచన భస్మరంజనా భుజగభూషణా దేవ
యోగకర్మాణి నిర్వికల్పాది నిర్మలానంద భావా
సర్వభక్తాని సకలలోకాది ముక్తిపథమే నీ సేవ నిత్యపూజలే అందు బృందము నీదువంశమే కాదా ( 1 )
నీలకంధరా…

 

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి