Skip to content

# Choose Language:

Nammina Na Madi Mantralayamega Lyrics in Telugu – నమ్మిన నా మది మంత్రాలయమేగా

Nammina Na Madi Mantralayamega LyricsPin

Nammina Na Madi Mantralayamega is a popular song on Sri Raghavendra Swamy from the telugu movie Raghavendra (2003). It was sung by Shreya Ghoshal. Get Nammina Na Madi Mantralayamega Lyrics in Telugu here.

Nammina Na Madi Mantralayamega Lyrics in Telugu – నమ్మిన నా మది మంత్రాలయమేగా

హే మంత్రాలయ దీపా
శ్రీ రాఘవేంద్ర గురునాధా
ప్రభో పాహిమాం

శ్రీ రాఘవేంద్ర గురునాధ
శ్రీ రాఘవేంద్ర గురునాధ
శ్రీ రాఘవేంద్ర గురునాధ
శ్రీ రాఘవేంద్ర గురునాధ
శ్రీ రాఘవేంద్ర గురునాధ
శ్రీ రాఘవేంద్ర గురునాధ
శ్రీ రాఘవేంద్ర గురునాధ
శ్రీ రాఘవేంద్ర గురునాధ
శ్రీ రాఘవేంద్ర గురునాధ

నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ
నమ్మని వారికి తాపత్రయమేగా
శ్రీ గురు బోధలు అమృతమయమేగా ఓ
చల్లని చూపుల సూర్యోదయమేగా

గురునాధ రాఘవేంద్రా
శ్రీ కృష్ణ పారిజాతా
హనుమంత శక్తి సాంద్రా
హరి నామ గాన గీతా

నీ తుంగభద్ర
మా పాపాలే కడగంగా
తుంగా దలాల సేవా
తులసీదళాల పూజా అందుకో

నిరాశ మూగే వేళా
మా దురాశ రేగే వేళా
నీ భజనే మా బ్రతుకై పోనీవా

పదాల వాలే వేళా
నీ పదాలు పాడే వేళా
నీ చరణం మా శరణం కానీవా

మనసు తెల్లని హిమవంతా
భవము తీర్చరా భగవంతా
మహిని దాచిన మహిమంతా
మరల చూపు మా హనుమంతా

నీ వీణ తీగలో యోగాలే పలుకంగా

తుంగా దలాల సేవా
తులసీదళాల పూజా అందుకో

నమ్మిన నా మది
మంత్రాలయమేగా ఓ
నమ్మని వారికి తాపత్రయమేగా

వినాశకాలం లోన
ధనాశ పుడితే లోన
నీ పిలుపే మా మరుపై పోతుంటే

వయస్సు పాడే వేళా
వసంతమాడే వేళా
నీ తలపే మా తలుపే మూస్తుంటే

వెలుగు చూపరా గురునాధా
వెతలు తీర్చరా యతిరాజా
ఇహము బాపి నీ హితబోధ
వరము చూపే నీ ప్రియగాధా

నీ నామగానమే ప్రాణాలై పలుకంగా

తుంగా దలాల సేవా
తులసీదళాల పూజా అందుకో

నమ్మిన నా మది
మంత్రాలయమేగా ఓ
నమ్మని వారికి తాపత్రయమేగా

శ్రీ గురు బోధలు
అమృతమయమేగా ఓ
చల్లని చూపుల సూర్యోదయమేగా

గురునాధ రాఘవేంద్రా
శ్రీ కృష్ణ పారిజాతా
హనుమంత శక్తి సాంద్రా
హరి నామ గాన గీతా

నీ తుంగభద్ర
మా పాపాలే కడగంగా
తుంగా దలాల సేవా
తులసీదళాల పూజా అందుకో

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి