Skip to content

# Choose Language:

Kattedura Vaikuntamu Lyrics in Telugu – కట్టెదుర వైకుంఠము

Kattedura Vaikuntamu Lyrics - Annamayya KeerthanaPin

Kattedura Vaikuntamu is a popular Annamayya keerthana on Tirumala Lord Venkateswara. Get Kattedura Vaikuntamu Lyrics in Telugu Pdf here.

Kattedura Vaikuntamu Lyrics in Telugu – కట్టెదుర వైకుంఠము 

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ ॥పల్లవి॥

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెసఁ బుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ
శ్రీదేవుఁడుండేటి శేషాద్రి యీకొండ ॥చ1॥

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విఁ దపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపు టంజనాద్రి యీ పొడవాటి కొండ ॥చ2॥

వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపుఁ గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దిదివో శ్రీవేంకటపుఁ గొండ ॥చ3॥

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి