Skip to content

# Choose Language:

Dandalayya Undralayya Song Lyrics in Telugu – దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా

Dandalayya Undralayya Song LyricsPin

Dandalayya Undralayya is a popular song on Lord Ganesha from the telugu movie Coolie No 1 (1991). It was sung by SP Bala Subrahmanyam and music was conducted by Ilayaraja. Get Dandalayya Undralayya Song Lyrics in Telugu here.

Dandalayya Undralayya Song Lyrics in Telugu – దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా

జై జై జై జై గణేశ జై
జై జై జై జై వినాయక జై

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి
తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలే ఆదరించి
తోడు నీడ అందించయ్యా
ఓఓఓ…

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ…

చరణం 1:

చిన్నారి ఈ చిట్టెలుకెలా
భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా
ముజ్జగములు తిప్పిందిరా
ఓ.. హో హో జన్మ ధన్యం

చిన్నారి ఈ చిట్టెలుకెలా
భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా
ముజ్జగములు తిప్పిందిరా
ఓ.. హో హో జన్మ ధన్యం

అంబారిగా ఉండగల ఇంతటి వరం
అయ్యోర అయ్య
అంబాసుతా ఎందరికి లబించురా
అయ్యోర అయ్య
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ

చరణం 2:

శివుని శిరసు సింహాసనం పొందిన
చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా
తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం

అరె శివుని శిరసు సింహాసనం
పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా
తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం

త్రిమూర్తులే నిను గని తలొంచరా
అయ్యోర అయ్య
నిరంతరం మహిమను కీర్తించరా
అయ్యోర అయ్యా
నువ్వెంత అనే అహం
నువ్వే దండించరా

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ

అరె రె రె.. పిండి వంటలారగించి
తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలే ఆదరించి తోడు నీడ
అందించయ్యా ఓ..

హే దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి