Chalada Ee Janma Chalada is a popular devotional song on Lord Shiva. Get Chalada Ee Janma Chalada Telugu Lyrics here and sing it for the grace of Lord Shiva.
Chalada Ee Janma Chalada Telugu Lyrics – చాలదా ఈ జన్మ చాలదా
చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
ఈ జన్మ చాలదా
ఈ జన్మ చాలదా
ఈ జన్మ చాలదా
చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
విభూతి ధారణతో కరమున కపాలంతో
కంఠాన నాగులతో అస్థికల మాలలతో
ఆకాశమంతెత్తు వ్యాపించినా శివ
(వ్యాపించినా శివ, వ్యాపించినా శివ)
అన్ని లోకాలను పాలించు పరమేశా
(పాలించు పరమేశా, పాలించు పరమేశా)
నా మదిలో నీవయ్య శ్రీశైల మల్లేశా
చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
వేదము తో కాని నాదము తో కాని
అర్చన తో కాని జపతపము తో కాని
నిను కాంచలేనయ్యా శ్రీశైల మల్లయ్యా
విశ్వమంత విస్తారించిన విశ్వేశ
భక్తి భావము చేత పిలిచిన చాలయ్యా
చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా
కైలాసవాసుని గళమెత్తి కీర్తింప
ఈ జన్మ చాలదా…
ఈ జన్మ చాలదా…
ఈ జన్మ చాలదా…
చాలదా…






