Skip to content

# Choose Language:

Adigo Bhadradri Lyrics in Telugu – అదిగో భద్రాద్రి

Adigo Bhadradri Lyrics - Ramadasu KeerthanaPin

Adigo Bhadradri Lyrics in Telugu – అదిగో భద్రాద్రి 

పల్లవి

అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ॥ అదిగో ॥

చరణములు

ముదముతో సీత ముదిత లక్ష్మణుడు
కదసి కొలువగా కలడదె రఘుపతి ॥ 1 ॥

చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి ॥ 2 ॥

అనుపమానమై అతిసుందరమై
తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి ॥ 3 ॥

కలియుగమందున నిల వైకుంఠము
నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి ॥ 4 ॥

పొన్నల పొగడల పూపొద రిండ్లతొ
చెన్ను మీరగను చెలగుచునున్నది ॥ 5 ॥

శ్రీకరముగ శ్రీరామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ॥ 6 ॥

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి